ఈ వదలా చిత్రాన్ని వదలకుండా నాకోసం చూడండి – జగపతి బాబు

Jagapathi Babu Requests Audiences Not to Miss Vadala

చరిత చిత్ర బ్యానర్ మీద కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ సంయుక్తంగా నర్మించిన చిత్రం ‘వదలా’. జగపతి బాబు, లయ, హృతిక శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో ఆకెళ్ల వి కృష్ణ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీని జూలై 17న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.  ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెన్సేషనల్ డైరెక్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జగపతి బాబు మాట్లాడుతూ .. ‘‘వదలా’ లాంటి థ్రిల్లర్ మూవీని చేయడం ఆనందంగా ఉంది. ఇదొక ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్. ఈ మూవీలో విషయం ఉంది, కంటెంట్ ఉంది అని నమ్మాను. అందుకే ప్రతీ విషయంలో నేను జాగ్రత్తగా తీసుకున్నాను. ఈ ‘వదలా’ చిత్రాన్ని వదలకుండా నాకోసం చూడండి. ఈ సినిమాకి ఇంకా బిజినెస్ కాలేదు. మా తమ్మారెడ్డి గారు, కిషోర్ గారు ధైర్యంతో ముందు అడుగు వేశారు. ఆడియెన్స్ సినిమా చూసి మాకు డబ్బులు ఇస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమాకి చోటా గారు, కార్తీక్ గారు కనిపించని హీరోలు. ఈ ప్రయాణంలో మాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్.

లయ గారితో నాకెన్నో ఏళ్ల నుంచి మంచి అనుబంధం ఉంది. ఆమె ఇప్పుడే ఇంకా అల్లరి చేస్తున్నారు (నవ్వుతూ). హృతిక ఎంతో సెలెక్టెడ్‌గా పాత్రల్ని ఎంచుకుంటోంది. కార్తీక్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. మాకోసం వచ్చిన అనిల్ రావిపూడికి థాంక్స్. తల ఎత్తుకుని తిరిగే సినిమాల్ని తీశాడు. అందరి క్షేమం కోరుకునే వ్యక్తి. మున్ముందు మరిన్ని మంచి పాత్రల్ని పోషించాలని అనుకుంటున్నాను. ఒక వేళ ‘వదలా’ మూవీని ప్రేక్షకులు ఆదరిస్తే.. హీరోగా ఇలాంటి డిఫరెంట్ పాత్రల్ని కూడా ప్రయత్నిస్తాను. ప్రేక్షకులు మా చిత్రాన్ని వదలకుండా చూసి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.