అక్కినేని అఖిల్ సరికొత్త మాస్ జాతర బాక్సాఫీస్ వద్ద మూడవ రోజు కూడా నెక్స్ట్ లెవెల్‌లో కంటిన్యూ అయింది. ‘లెనిన్’ ఫస్ట్ వీకెండ్‌ను అత్యంత ఘనంగా, కళ్ళు చెదిరే కలెక్షన్లతో ముగించింది. విడుదలైన మొదటి రోజు నుంచే సాలిడ్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ రూరల్ యాక్షన్ డ్రామాను తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న ఈ చిత్రం కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 61.1 కోట్ల రూపాయలకు పైగా భారీ గ్రాస్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. అఖిల్ కెరీర్‌లోనే మొదటి సారి 60 కోట్ల మార్కును అందుకున్న చిత్రంగా ‘లెనిన్’ సరికొత్త చరిత్ర సృష్టించింది. థియేటర్లలో ఆడియన్స్ ఈ సినిమాను ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన విధానం, అఖిల్ నటన ఈ భారీ వసూళ్లకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌ప్రైజెస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం వీక్ డేస్‌లో కూడా ఇదే జోరును కొనసాగిస్తూ లాంగ్ రన్‌లో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























