డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మార్క్ పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్స్, రా అండ్ రస్టిక్ డైలాగ్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆయన దర్శకత్వంలో, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘స్లమ్ డాగ్’ – 33 టెంపుల్ రోడ్ అఫీషియల్ టీజర్ విడుదలైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మురికివాడల నేపథ్యంలో జరిగే సర్వైవల్, గ్యాంగ్‌స్టర్ పాలిటిక్స్ మరియు పగ-ప్రతీకారాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. పూరి జగన్నాథ్ ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో రియలిస్టిక్‌గా, ఊర మాస్ స్టైల్లో ఆవిష్కరించారు. టీజర్లో చూపించిన హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, పవర్ఫుల్ డైలాగ్స్ మాస్ ఆడియన్స్‌కు పర్ఫెక్ట్ మీల్స్‌లా ఉన్నాయి. వీటికి తోడు వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.. పూరి మార్క్ మాస్ బాడీ లాంగ్వేజ్‌తో సేతుపతి లుక్ అండ్ యాక్టింగ్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచాయి.ట్విస్ట్ ఏంటంటే ఇందులో విజయ్ సేతుపతి అంధుడిగా నటిస్తున్నాడు.
పూరి కనెక్ట్స్ మరియు జెబి మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై భారీ నిర్మాణ విలువలతో రాబోతున్న ఈ సినిమాలో ఇండియన్ సినిమాలోని టాప్ స్టార్స్ భాగమయ్యారు.సంయుక్త మీనన్ ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్‌గా నటిస్తుండగా టబు ఈ చిత్రంలో ఒక పవర్ఫుల్ మరియు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.: కన్నడ స్టార్ నటుడు/దర్శకుడు (సలగా ఫేమ్) ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఒక సాలిడ్ రోల్ పోషిస్తున్నారు.
హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈసినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు.ఇక ఈసినిమాతో సాలిడ్ హిట్ కొట్టి పూరి మళ్ళీ కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























