మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది. అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘బాక్సాఫీస్ ఛాంపియన్’ సక్సెస్ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్లాడుతూ: ప్రేక్షకులందరికీ నమస్కారం. సినిమా విడుదలైనప్పటి నుంచి నా ఫోన్ రింగ్ అవడం ఆగలేదు. ‘ఉప్పెన’ సమయంలో కూడా ఇదే జరిగింది. అయితే ‘ఉప్పెన’ కంటే పది రెట్లు ఎక్కువ రెస్పాన్స్ ఇప్పుడు వస్తోంది. అందరూ ఫోన్ చేసి సినిమా పెద్ద హిట్ అయ్యిందని చెబుతున్నారు. సినిమా చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యామని అంటున్నారు. అందరికీ థాంక్యూ సో మచ్.
‘పెద్ది’ ఒక ఇన్‌స్పిరేషనల్ క్యారెక్టర్. చరణ్ సార్ పెర్ఫార్మెన్స్ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకోవడం చాలా ఆనందంగా ఉంది. కుటుంబాలు కలిసి సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. నేను నమ్మిన విషయాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. చరణ్ గారు పడిన కష్టాన్ని అందరూ గుర్తించారు. చరణ్ గారు లేకపోతే ఈ సినిమా లేదు. ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఈ సినిమా మరింత అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























