సింగ్ గీతం లాంటి కాన్సెప్ట్‌తో ఇప్పటివరకు భారతీయ సినీ పరిశ్రమలో సినిమా రాలేదు – హీరో అయాన్

No Indian Film Has Ever Come with a Concept Like Sing Geetham says Hero Ayaan

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌  ‘సింగ్ గీతం’ తో ముందుకు వస్తున్నారు. దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్‌లో, పలు భాషల్లో దాదాపు అరవై చిత్రాలతో ఇండియన్ సినిమాని రీడిఫైన్ చేసిన సంగీతం, 94 ఏళ్ల వయసులో డైరెక్టర్ చైర్ లోకి తిరిగి వస్తూ, సృజనాత్మకతకు హద్దులు లేవని మరోసారి నిరూపిస్తున్నారు. ఐకానిక్ మూకీ చిత్రం ‘పుష్పక్’ నుంచి  విజనరీ సైన్స్ ఫిక్షన్ క్లాసిక్ ‘ఆదిత్య 369’ వరకు ఆయన క్రియేటివిటీకి పర్యాయపదంగా నిలిచారు. కమల్ హాసన్‌తో ఆయన చేసిన ‘విచిత్ర సహోదరులు’,  ‘మైఖేల్ మదన కామరాజన్’ బెంచ్ మార్క్ సినిమాలుగా నిలిచాయి. ఇప్పుడు, భారతదేశపు మొట్టమొదటి మ్యూజికల్ ఫాంటసీగా రూపొందించబడిన ‘సింగ్ గీతం’తో అలరించబోతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వైజయంతి మూవీస్, స్వప్న సినిమా వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ల పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్, ఒక దిగ్గజ దార్శనికుడిని, లెజండరీ నిర్మాణ సంస్థను ఒకచోట చేర్చింది. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ‘సింగ్ గీతం’ టీజర్, ‘హలో బాసు’ టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘సింగ్ గీతం’ జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ రోజు మేకర్స్  మీట్ అవర్ వైజాగ్ హీరో ఈవెంట్ నిర్వహించారు.

మీట్ అవర్ వైజాగ్ హీరో ఈవెంట్ లో హీరో అయాన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నా పేరు అయాన్. మాది వైజాగ్‌. అక్కయ్యపాలెంలో పెరిగాను. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లి తెలుగు సినిమాలో హీరోగా నటించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఇది నా తొలి చిత్రం. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా, లెజెండరీ సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో పనిచేసే అవకాశం రావడం నిజంగా అదృష్టం. అన్ని వయసుల ప్రేక్షకులు ఎంజాయ్ చేసే అద్భుతమైన సినిమా ఇది. ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇప్పటివరకు భారతీయ సినీ పరిశ్రమలో ఎవరూ సినిమా చేయలేదు. అలాంటి ప్రత్యేకమైన చిత్రానికి నేను హీరో అవుతానని ఎప్పుడూ ఊహించలేదు. ఇది నాకు నిజంగా ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్.

అహల్యా బమ్రూ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాలో నేను ‘గౌరీ’ పాత్రను పోషిస్తున్నాను. మాది పుదుచ్చేరి . వైజాగ్ చూస్తుంటే నాకు పాండిచ్చేరి గుర్తొస్తుంది. నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం. ఈ సినిమా కోసం తెలుగు కూడా నేర్చుకున్నాను. ‘సింగ్ గీతం’లో నటించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. వైజయంతి మూవీస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో పని చేయడం ప్రతి నటుడి కల. ఈ సినిమాతో నా ఆ కల నెరవేరింది. జూన్ 11న విడుదల కానున్న ఈ చిత్రాన్ని అందరూ థియేటర్లలో చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

శాలిని కొండేపూడి మాట్లాడుతూ.. వైజాగ్ నాకు చాలా స్పెషల్. ఐ లవ్ వైజాగ్. ఈ సినిమాలో నేను ‘రేణు’ పాత్రలో కనిపించబోతున్నాను. ఇది చాలా కొత్తగా, ప్రత్యేకంగా ఉండే పాత్ర. ఇలాంటి విలన్ పాత్రను మీరు ఇప్పటివరకు ఏ సినిమాలోనూ చూసి ఉండరు. మా ఇంట్లో వాళ్లు నన్ను చూసి ‘నీలాంబరి తర్వాత నువ్వే’ అని సరదాగా అంటుంటారు (నవ్వుతూ). సింగీతం శ్రీనివాసరావు గారి సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. జూన్ 11న సినిమా విడుదల కానుంది. తప్పకుండా అందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.  

లైవ్ వీడియో కాల్‌లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. హాయ్ వైజాగ్. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో పనిచేయడం నిజంగా ఒక అదృష్టం. అలాంటి అవకాశం చాలా అరుదుగా వస్తుంది. ఆయన కోసం అయినా ఈ సినిమా తప్పకుండా చూడాలి. ‘సింగ్ గీతం’ ఒక కంప్లీట్ మ్యూజికల్ ఫిల్మ్. ఈ సినిమా కోసం మేమంతా ఎంతో మనసుపెట్టి పనిచేశాం. ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాను ఎంతో ఇష్టపడతారని నమ్ముతున్నాను. ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్యూ వైజాగ్… లవ్ యూ ఆల్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.