సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ‘పర్సంటేజీ సిస్టమ్’ అమలు చేయాలన్న ఎగ్జిబిటర్ల నిర్ణయంపై టాలీవుడ్ నిర్మాతలు స్పందించారు. ఈ వివాదానికి సంబంధించి బుధవారం జరిగిన ప్రెస్ మీట్‌లో నిర్మాతలు తమ వాదనను వినిపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పరిశ్రమలో కేవలం ప్రదర్శనకారులకే (ఎగ్జిబిటర్లు) కాకుండా, నిర్మాతలు మరియు పంపిణీదారులకు కూడా అనేక సమస్యలు ఉన్నాయని నిర్మాతలు గుర్తు చేశారు. అందరం కలిసి కూర్చుని చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి తప్ప, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని బెదిరింపు ధోరణిలో మాట్లాడటం సరికాదని వారు అభిప్రాయపడ్డారు.
గత కొద్ది నెలలుగా సరైన విజయాలు లేక చిత్ర పరిశ్రమ ఇబ్బందుల్లో ఉందని, ఇప్పుడు ‘పెద్ది’ వంటి పెద్ద సినిమాలు వస్తున్న తరుణంలో ఇలాంటి అడ్డంకులు సృష్టించడం వల్ల అందరికీ నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వందల సంఖ్యలో మల్టీప్లెక్స్‌లు ఉన్న వారు సింగిల్ స్క్రీన్ల కష్టాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
సింగిల్ స్క్రీన్లలో వసతులు మెరుగుపరచడం, క్యాంటీన్లలో తినుబండారాల ధరలు తగ్గించడం వంటి పనులు చేస్తే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం పెరుగుతుందని నిర్మాతలు సూచించారు. తాము పర్సంటేజీ విధానానికి వ్యతిరేకం కాదని, అయితే కొత్తగా నిర్మించే సినిమాల విషయంలో ఈ చర్చలు జరపాలని, ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలపై ఒత్తిడి తీసుకురావద్దని కోరారు.
ఈ ప్రెస్ మీట్‌లో నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి తదితరులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























