డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’ తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో హీరో శ్రీవిష్ణు స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. గాయపడ్డ సింహం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ విసా స్టాపింగ్ ఈవెంట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. అందరికీ హాయ్. ఈ సినిమాకు ఫస్ట్ హీరో పవన్ సాదినేని. ఆయన ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు ప్రొడ్యూసర్లు లేరు. నాకు, తరుణ్‌కి చెప్పిన తర్వాత సినిమా స్టార్ట్ చేశాడు. మధ్యలో కొన్ని సమస్యలు వచ్చినా, కశ్యప్ వెనుక నిలబడ్డాడు . ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ చేసిన క్యారెక్టర్, ట్రంప్‌తో పెట్టుకున్న గొడవ వల్ల నా క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవుతుంది. నాకు తెలియకుండా శ్రీ విష్ణు క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఈ సినిమాకి ఒక సమస్య వచ్చింది. ఈ సినిమాలో ట్రంప్ కార్డ్ ఉంది. కశ్యప్ ఇండియా–అమెరికాకు వార్ తీసుకురాగలిగాడు(నవ్వుతూ). శ్రీ విష్ణు అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో కనిపిస్తారు. మీరు హాయిగా నవ్వుకోవాలంటే మే 1న ‘గాయపడ్డ సింహం’ తప్పకుండా చూడండి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























