60 రోజుల్లో ది బ్లాక్ గోల్డ్ షూటింగ్ కంప్లీట్ 

The Black Gold Shoot to Be Completed in 60 Days

వెర్సటైల్ హీరోయిన్ సంయుక్త ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన హై-వోల్టేజ్ ప్రాజెక్ట్ , హీరోయిన్-సెంట్రిక్ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా ‘ది బ్లాక్ గోల్డ్‌’ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యోగేష్ KMC దర్శకత్వంలో, మాగంటి పిక్చర్స్ సహకారంతో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ కథ, చేతిలో గన్ ఉన్నప్పటికీ చట్టాన్ని ముఖ్యంగా భావించే ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. దేశాన్ని కుదిపేసిన కోల్ సిండికేట్‌ల నేపథ్యంలో, నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఈ కథ మరింత గ్రిప్పింగ్‌గా తీర్చిదిద్దారు.

రిలీజ్ చేసిన తాజా పోస్టర్‌లో సంయుక్త పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తోంది. భారీ ఇండస్ట్రియల్ మెషీన్ ముందు సన్‌గ్లాసెస్‌తో స్టైలిష్‌గా నిలబడి, చేతిలో గన్‌ను పట్టుకుని కనిపించడం ద్వారా ఆమె పాత్రలోని అగ్రెషన్ ని ప్రజెంట్ చేస్తోంది.  

ఈ చిత్రాన్ని మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, ఆదిలాబాద్ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లలో చిత్రీకరించారు. మొత్తం 60కి పైగా వర్కింగ్ డేస్‌లో షూటింగ్ పూర్తిచేయడం విశేషం. ఐదు పవర్‌ఫుల్ షెడ్యూల్స్‌లో, 10కి పైగా భారీ సెట్లలో, రోజుకు 300 మందికి పైగా క్రూ పాల్గొంటూ చిత్రీకరణ జరిగింది. మేకింగ్ వీడియోలో ఈ ఎఫర్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. 

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో అరుదుగా కనిపించే స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు రూపొందించారు. ఈ చిత్రీకరణ కోసం ప్రతిరోజూ రెండు కెమెరాలను ఉపయోగించారు, కొన్ని సందర్భాల్లో అయితే ఏకంగా ఐదు కెమెరాలను ఏకకాలంలో వినియోగించారు.

అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ‘బ్లాక్ గోల్డ్’ చిత్రం, సినిమా ప్రేమికులను, నేటి తరం (Gen Z) ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. 

ఈ చిత్రంలో మురళీ శర్మ, రావు రమేష్, నాసర్, మనీష్ వాధ్వా, రాంకి, రవీంద్ర విజయ్, అడుకలం నరేన్, BVS రవి, కృష్ణ చైతన్య, చంద్రిక రవి ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు. 

ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం సమకూర్చగా, ఎ. వసంత్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. చోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.బ్లాక్ గోల్డ్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో పాన్-ఇండియన్ విడుదల కానుంది. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.