మిషన్ ఇంపాజిబుల్ సినిమా సత్యతో తీస్తే ఎలా వుంటుందో జెట్‌ లీ అలా వుంటుంది – రితేష్ రానా

Ritesh Rana says Jetlee Is Like Mission Impossible with Satya

కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్య, ఇప్పుడు హీరోగా దర్శకుడు రితేష్ రానాతో మళ్లీ జతకట్టి చేస్తున్న చిత్రం ‘జెట్‌ లీ’. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మరోసారి క్విర్కీ, డిఫరెంట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించబోతుందని ప్రామిస్ చేస్తోంది. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తున్నారు. మే 1న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ కథలో సత్య పోషిస్తున్న పాత్ర ప్రత్యేకంగా నిలుస్తోంది. జ్ఞాపకశక్తి కోల్పోయిన ఒక వ్యక్తిగా, తనను తాను వెతుక్కుంటూ వింత పరిస్థితుల్లో ఉంటాడు. కానీ తన ప్రశ్నలకు సమాధానాలు దొరకడం బదులుగా, చుట్టూ ఉన్నవారి నుంచి సెటైర్లు ఎదురవుతాయి. ఈ కాన్సెప్ట్‌ను ఎమోషనల్‌గా కాకుండా పూర్తిగా కామెడీ ట్రాక్‌లో నడిపించడం ఈ సినిమాకి ప్రధాన బలం.

ట్రైలర్‌లో కనిపించే మరో ఆసక్తికర అంశం.. రియాలిటీ, పర్సెప్షన్ మధ్య ఉన్న కాంట్రాస్ట్. అందరికీ సత్య ఒక జోక్‌లా కనిపించినా, తాను మాత్రం పెద్ద యాక్షన్ హీరోలా బిహేవ్ అవుతాడు. ఈ మిస్మ్యాచ్ వల్లే సినిమా మొత్తం నవ్వుల వర్షంగా మారుతోంది. యాక్షన్ సీన్స్ కూడా సీరియస్‌గా కాకుండా, ప్యారడీ టచ్‌తో ఉండటం ప్రత్యేక ఆకర్షణ.

సత్య తన సహజమైన స్టైల్‌లో అండర్‌ప్లే పెర్ఫార్మెన్స్‌తో నవ్వులు పండించారు. ఎక్కువగా ట్రై చేయకుండా కామెడీ క్రియేట్ చేయగలగడం ఆయన ప్రత్యేకతను మరోసారి చూపిస్తుంది.

రియా సింగ్ గ్లామర్‌తో పాటు యాక్షన్‌లో కూడా ఆకట్టుకుంటుండగా, వెన్నెల కిషోర్, వైవా హర్ష తమ ట్రేడ్‌మార్క్ కామెడీతో కథను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చారు.దర్శకుడు రితేష్ రానా తన ప్రత్యేకమైన స్టైల్‌ను ఈసారి మరింత ఎలివేట్ చేశారు.

టెక్నికల్‌గా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సురేష్ సారంగం విజువల్స్‌కు కలర్‌ఫుల్ టోన్ ఇవ్వగా, కాల భైరవ సంగీతం ట్రైలర్ ఎనర్జీకి తగ్గట్టుగా సింక్ అయింది. ఎడిటింగ్‌ను కార్తీక శ్రీనివాస్ , ప్రొడక్షన్ డిజైన్‌ను నార్ని శ్రీనివాస్ అందించారు.

మొత్తానికి ట్రైలర్ చూస్తే ఈ సినిమా సరదాగా ఎంటర్‌టైన్ చేయడానికి, నవ్వులు పంచడానికి వచ్చిన వినూత్న ప్రయత్నం. ‘జెట్‌లీ’ తన పూర్తి మ్యాడ్‌నెస్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.

డైరెక్టర్ రితేష్ రానా మాట్లాడుతూ.. ఇది యాక్టర్ ని బట్టి డిజైన్ అయ్యే స్టొరీ. సత్య అనుకున్నప్పుడు తన స్టయిల్ క్యారెక్టరైజేషన్ బట్టి స్క్రిప్ట్ ని డిజైన్ చేశాం. సత్య యాడ్ అవ్వడం వలన కామెడీ మరింత ఎలివేట్ అయ్యింది. సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. మిషన్ ఇంపాజిబుల్ సినిమా సత్యతో తీస్తే ఎలా వుంటుందో ‘జెట్‌ లీ’ అలా వుంటుంది. ఇందులో యాక్షన్ కామెడీ ట్విస్ట్ లు అన్నీ వుంటాయి. తెలుగులో ఈ సినిమా చాలా కొత్తగా వుంటుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.