బ్యాడ్ బాయ్ కార్తీక్ అందరికీ నచ్చేలా ఉంటుందని నమ్ముతున్నాము – హీరో నాగశౌర్య

Bad Boy Karthik Will Connect with Everyone Says Naga Shaurya

హీరో నాగ శౌర్య, రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కిన ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ చిత్రంతో మాస్ అవతార్‌లో రాబోతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రం, సూపర్ హిట్ పాటలు, శౌర్యను మునుపెన్నడూ లేని విధంగా ఇంటెన్స్‌గా చూపించిన పవర్-ప్యాక్డ్ టీజర్, ట్రైలర్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ నెల 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా మేకర్స్ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ థాంక్యూ. రసూల్ గారు ఈ సినిమాలో నన్ను చాలా బాగా చూపించారు, చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన వయసులో ఉన్నప్పుడు హీరోగా ట్రై చేసి ఉంటే బాగుండేది (నవ్వుతూ). ఆయన వల్ల ఈ సినిమా విజువల్స్ అద్భుతంగా వచ్చాయి. మా హీరోయిన్ విధికి ఇది తెలుగులో ఫస్ట్ సినిమా. ఆమెకు ఇది మంచి లాంచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీదేవి గారితో పనిచేయడం చాలా మంచి అనుభవం. ఆమె ప్రభాస్ గారి మొదటి సినిమాలో చేశారు, నాకు కూడా అలాంటి లక్ రావాలని కోరుకుంటున్నాను. సాయికుమార్ గారు, వెన్నెల కిషోర్ గారు, సుదర్శన్ గారు, సముద్రఖని గారు ఇలా చాలా పెద్ద తారాగణం ఈ సినిమాలో ఉంది. డైరెక్టర్ రమేష్ గారు చాలా కష్టపడి చేశారు. మా నిర్మాతలు చాలా కష్టపడి సినిమా తీశారు. వారికి మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది అని నమ్ముతున్నాను. ఏప్రిల్ 17న థియేటర్లలో సినిమా చూసి మీ అభిప్రాయం చెప్పండి. థాంక్యూ సో మచ్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.