వరుస బ్లాక్బస్టర్ విజయాలతో అలరిస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శ్రీ పద్మిని సినిమాస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏప్రిల్ 10న ఈ చిత్రం గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ప్రదీప్ “లవ్ టుడే” సినిమా చూసినప్పుడే ఇది తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని అనిపించింది. అందుకే తెలుగులో రిలీజ్ చేశాం. ఆ సినిమా పెద్ద సక్సెస్ అయింది. ఇప్పుడు ప్రదీప్ హీరోగా, డైరెక్టర్గా వరుస విజయాలు సాధిస్తున్నాడు. విగ్నేష్ శివ ఎప్పుడూ డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తారు. “లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” కూడా అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ రోజుల్లో ప్రేమ కథ తీయడం చాలా కష్టం. అలాంటి సమయంలో అందరికీ రిలేట్ అయ్యేలా, ఒక అప్లికేషన్ బ్యాక్డ్రాప్లో ఈ కథ తీసారు. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఏప్రిల్ 10న సినిమా రిలీజ్ అవుతోంది. ప్రేక్షకులు ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. మా అనిల్ కూడా హీరోలా ఉంటాడు. ప్రదీప్ లా తను కూడా యాక్టింగ్ చేస్తే సరైన కథతో, సరైన టైమ్లో నేను అతన్ని హీరోగా పరిచయం చేయాలని అనుకుంటున్నాను (నవ్వుతూ).
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























