బైకర్లో ఎంతో మంచి ఎమోషన్ ఉంది – రాజశేఖర్

Rajashekar’s Speech at ‘Biker’ Success Meet

చార్మింగ్ స్టార్ శర్వా లేటెస్ట్ బంపర్ బ్లాక్ బస్టర్ బైకర్. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ ఫుల్ పాత్రని పోషించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక బ్యానర్ UV క్రియేషన్స్ నిర్మాణంలో భారతదేశపు మొట్టమొదటి కంప్లీట్ మోటో క్రాస్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ప్రిమియర్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రేక్షకులు, విమర్శకులు నుంచి అద్భుతమైన రెస్పాన్స్ తో బంపర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బంపర్ బ్లాక్ బస్టర్ మీట్ ని నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సీనియర్ హీరో రాజశేఖర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడం, మంచి పేరు తెచ్చుకోవడానికి ఒక ముఖ్య కారణం డైరెక్టర్ అభిలాష్ రెడ్డి గారు. ఆయన ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఆయన విజన్‌కు తగ్గట్టు ఖర్చు పెట్టిన నిర్మాత వంశీ గారికి హ్యాట్సాఫ్. ఈ సినిమాలో రేసింగ్‌తో పాటు అందమైన ఫ్యామిలీ మూమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ టైమ్ స్క్రీన్ మీద నన్ను “తాతయ్య” అని పిలిపించే క్యారెక్టర్ చేశాను. ఈ సినిమాలో నాకు ఇంత మంచి పేరు రావడానికి కారణం డైరెక్టర్ అభిలాష్ గారే. అలాగే శర్వా గారు కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఈ సినిమాలో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాకు పనిచేసిన అన్ని టెక్నీషియన్స్‌కి, నటీనటులకు నా ధన్యవాదాలు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.