చార్మింగ్ స్టార్ శర్వా లేటెస్ట్ బంపర్ బ్లాక్ బస్టర్ బైకర్. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ ఫుల్ పాత్రని పోషించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక బ్యానర్ UV క్రియేషన్స్ నిర్మాణంలో భారతదేశపు మొట్టమొదటి కంప్లీట్ మోటో క్రాస్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ప్రిమియర్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రేక్షకులు, విమర్శకులు నుంచి అద్భుతమైన రెస్పాన్స్ తో బంపర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బంపర్ బ్లాక్ బస్టర్ మీట్ ని నిర్వహించారు.ఈ ఈవెంట్ కి డైరెక్టర్ సంపత్ నంది ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో సంపత్ నంది మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. “బైకర్” ప్రీమియర్స్ చూసినప్పటి నుంచి బైక్ సౌండ్ ఇంకా చెవుల్లో మోగుతూనే ఉంది. అంత గొప్పగా ఈ సినిమాకు సౌండ్ మిక్సింగ్ చేశారు. ఆ సౌండ్ రీసౌండ్ రూపంలో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్‌గా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శర్వా గారు ఈ సినిమా కోసం ప్రతిరోజూ దాదాపు 30 కిలోమీటర్లు నడవడం నేను ప్రత్యక్షంగా చూశాను. అంత డెడికేషన్‌తో ఈ సినిమా చేశారు. నేను ఆయన అన్ని సినిమాలు చూశాను; “బైకర్” ఆయన కెరీర్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇకనుంచి శర్వా గారి కొత్త యాంగిల్ చూడబోతున్నారు. మొన్న “నారి నారి”, ఇప్పుడు “బైకర్”, నెక్స్ట్ “భోగి” — ఇలా శర్వానామ సంవత్సరం చూడబోతున్నారు. శర్వా గారు, రాజశేఖర్ గారు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. రాజశేఖర్ గారితో పని చేసే అదృష్టం నాకు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి విజన్ ని నమ్మి ఈ సినిమాను అద్భుతంగా నిర్మించిన యూవీ క్రియేషన్స్‌కు అభినందనలు. మొత్తం టీమ్‌కు కంగ్రాచ్యులేషన్స్.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























