ప్రముఖ కమెడియన్ సత్య కథానాయకుడిగా రూపొందుతున్న క్రేజీ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘జెట్లీ’ నుండి ఈరోజు వీడియో సాంగ్ విడుదలైంది. రితేష్ రానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉండగా, తాజాగా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ పాటకు “సత్య ఈజ్ నాట్ జెట్లీ” అనే ఆసక్తికరమైన టైటిల్ ఇచ్చారు. కాల భైరవ అందించిన అదిరిపోయే మాస్ అండ్ ఎనర్జిటిక్ ట్యూన్‌కు సత్య తనదైన గ్రేస్‌ఫుల్ స్టెప్పులు మరియు కామెడీ టైమింగ్‌తో ప్రాణం పోశారు. ఈ వీడియో సాంగ్‌లో సత్య వెరైటీ గెటప్స్, ఆయన మేనరిజమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా విజువల్స్ చాలా కలర్ఫుల్గా వున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ మరియు క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా, విమానం హైజాక్ నేపథ్యంలో సాగే ఒక సెటైరికల్ డ్రామా. సత్య సరసన రియా సింఘా హీరోయిన్గా నటించగా , వెన్నెల కిశోర్ తనదైన శైలిలో నవ్వులు పూయించనున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం, సమ్మర్ కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ ఫుల్ వీడియో సాంగ్ విడుదలతో సినిమా ప్రమోషన్లలో ‘జెట్లీ’ టీమ్ వేగాన్ని పెంచింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























