ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ డేట్ లాక్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 14న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హైదరాబాద్‌లో భారీ ఈవెంట్‌ నిర్వహించి ఈ ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ ఈ ట్రైలర్‌ను పవన్‌ కల్యాణ్ మార్క్ డైలాగులు , స్వాగ్ , స్టైల్ మరియు యాక్షన్ సన్నివేశాలతో సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన ‘భగత్ గీత’ టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా, ఇప్పుడు ఈ ట్రైలర్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించబోతోంది.ఈ ట్రైలర్ తో ఫ్యాన్స్ పండగ చేసుకోనున్నారని సమాచారం.

ఈ చిత్రం మార్చి 19న ఉగాది కానుకగా విడుదల కానున్న నేపథ్యంలో, ఈ ట్రైలర్ సినిమా ప్రమోషన్లలో అత్యంత కీలకం కానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా థమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నాడు.దాంతో ట్రైలర్ బీజీఎమ్ ఎలా వుండనుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

హరీష్ మార్క్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో శ్రీలీల ,రాశి ఖన్నా హీరోయిన్లు గా నటించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. సుమారు 2 :33 గంటల రన్ టైం తో ఈనెల 19న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.