ఉస్తాద్ భగత్ సింగ్ థర్డ్ సింగిల్ ప్రోమో రిలీజ్

Collar Ey Etthara Song Promo from Ustaad Bhagat Singh out now

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ,డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా నుంచి మూడవ పాట అప్‌డేట్ వచ్చేసింది. ‘కాలరే ఎత్తరా ‘ అనే సాంగ్ ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సాంగ్ ప్రోమోలో పవన్ కల్యాణ్ తన మార్క్ మాస్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను ఆలరించారు. హరీష్ శంకర్ సినిమాల్లో ఉండే ఒక ప్రత్యేకమైన ఎనర్జీ ఈ పాటలో స్పష్టంగా కనిపిస్తోంది.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, రామ్ మిర్యాల వోకల్స్ ఈ సాంగ్ పక్కా చార్ట్ బస్టర్ అనే ఫీల్ తెప్పించాయి. దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించగా ఇందులో పవన్ వేసే హుక్ స్టెప్ హైలైట్ గా నిలువనుంది.ఫుల్ సాంగ్ ఈనెల 12న విడుదలకానుంది.

ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా ఇప్పుడు ఈ ప్రోమోతో మూడవ పాటపై భారీ అంచనాలు ఉన్నాయి.సెన్సార్ పూర్తి చేసుకుని ‘U/A’ సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

ఇక ఇంతకుముందు పవన్ – హరీష్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడొస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు భారీగా వున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.