ఉస్తాద్ భగత్ సింగ్ రన్ టైం రివీల్

Ustaad Bhagat Singh’ Censor Formalities Completed Runtime Revealed

పవన్‌ కల్యాణ్ హీరోగా, హరీష్‌ శంకర్ దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సెన్సార్‌ పూర్తి చేసుకుంది.ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు ‘యూ/ఏ’ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. సెన్సార్‌ బోర్డు సభ్యులు ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, పవన్‌ కల్యాణ్ మార్క్ మేనరిజం మరియు డైలాగ్ డెలివరీని ప్రశంసించినట్లు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 19న గ్రాండ్‌గా విడుదల కానుంది.నిజానికి మొదట 26న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ వరుస సెలవులు వుండడంతో కొంచెం ముందుగానే ఉగాదికి విడుదలచేస్తున్నారు. సుమారు 2 గంటల 34 నిమిషాల నిడివి తో ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

పవన్‌ కల్యాణ్ సరసన శ్రీలీల , రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించగా , అశుతోష్ రాణా, నవాబ్ షా,కీలక పాత్రల్లో కనిపించనున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. సెన్సార్‌ క్లియర్ కావడంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేయనుంది. అయితే ఉగాదికి ధురంధర్ 2 కూడా విడుదలకానుండడంతో బాక్సాఫీస్ వద్ద ఉస్తాద్ భగత్ సింగ్ కి పోటీ ఎదురుకానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.