కమెడియన్ సత్య హీరోగా నటిస్తున్న జెట్లీ షూటింగ్ నేటితో పూర్తయింది. కేవలం రెండు నెలల్లోనే ఈ షూట్ కంప్లీట్ చేశారు. ఈ సందర్భంగా స్పెషల్ వీడియో కూడా విడుదలచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా మొత్తం ఒక విమానంలోనే సాగే యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్. విమాన ప్రయాణంలో జరిగే గందరగోళం, హైజాక్ డ్రామా మరియు హాస్యం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ . ఇందులో సత్య హీరోగా నటించగా , మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. వీరితో పాటు వెన్నెల కిషోర్, అజయ్, మరియు వైవా హర్ష కీలక పాత్రల్లో కనిపించనునున్నారు.
‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రాణా దర్శకత్వం వహిస్తుండగా, కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఇక సినిమా షూటింగ్ పూర్తి కావడంతో త్వరలోనే పోస్ట్-ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటించనున్నారు. కుదిరితే మే లో ఈసినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































