నటీనటులు: శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్, వీర్ ఆర్యన్, చిన్నా, సుదర్శన్, రచ్చ రవి, బాలాదిత్య తదితరులు.
ఎడిటింగ్ :శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : విద్యా సాగర్ చింత
సంగీతం: కాలభైరవ
దర్శకత్వం: హుస్సేన్ షా కిరణ్
నిర్మాణం: సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హాస్య ప్రధానమైన సినిమాలతో అలరిస్తూ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న హీరో శ్రీవిష్ణు పూర్తిగా భిన్నమైన జానర్‌లో నటించిన సినిమా’మృత్యుంజయ్’ . ఒక సామాన్య రిపోర్టర్ తన తెలివితేటలతో ఒక పెద్ద నేర పరిశోధనలో ఎలా భాగమయ్యాడు అనేది ఈ సినిమా ఇతివృత్తం.విడుదలకు ముందు మంచి హైప్ తెచ్చుకున్న ఈసినిమా ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. మరి ఈసినిమా ఎలాఉందో రివ్యూ లో తెలుసుకుందాం.
కథ :
జై (శ్రీవిష్ణు) ఒక రిపోర్టర్ కావాలని కలలు కనే వ్యక్తి, కానీ అడ్వర్టైజింగ్ విభాగంలో పనిచేస్తూ బతుకుతుంటాడు. చనిపోయిన వారి గురించి సమాచారం సేకరించి, ప్రకటనలు ఇచ్చేవారి దగ్గర నుండి ఆర్డర్లు తీసుకోవడం అతని వృత్తి. ఒకసారి అచ్యుత్ రావు అనే వ్యక్తి మరణం తర్వాత, అతని చిన్నారి కూతురు అంజలిని చూసి, జై ఆమెకు తండ్రి మరణం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకుంటానని మాట ఇస్తాడు. పోలీసుల దృష్టిలో అవి సహజ మరణాలుగా అనిపించినా, అవే హత్యలని జై నమ్ముతాడు. ఈ హంతకులను పట్టుకునే క్రమంలో జైకి ఎదురయ్యే సవాళ్లు, వారితో అతను చేసే మైండ్ గేమ్ ఈ సినిమా ప్రధాన కథాంశం.
విశ్లేషణ:
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథ తో ఈ మృత్యుంజయ్ ని అంతే గ్రిప్పింగ్ గా తెర మీదకు తీసుకురావడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.సినిమా ప్రారంభం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. హీరో జై పాత్రను పరిచయం చేసిన విధానం, శ్రద్ధాంజలి ప్రకటనలు సేకరించే అతని వృత్తిని చూపించిన తీరు బాగుంటుంది. అచ్యుత్ రావు మరణం తర్వాత, చిన్నారి అంజలితో హీరోకు ఉన్న అనుబంధం మరియు హీరో తన మాట మీద నిలబడి ఆ మరణం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించాలని నిర్ణయించుకోవడం కథను వేగంగా ముందుకు నడిపిస్తుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మొదలవ్వడం, పోలీసులు ప్రమాదాలుగా భావించిన వాటిని హీరో హత్యలుగా అనుమానించడం వంటి అంశాలతో ప్రథమార్ధం ఉత్కంఠను పెంచుతుంది.
రెండో అర్థ భాగం సినిమాకు ప్రధాన బలం. హంతకుడు ఎవరో తెలుసుకోవడానికి హీరో చేసే ప్రయత్నాలు, ఒకరికొకరు తెలియకుండా ఇద్దరి మధ్య సాగే మైండ్ గేమ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి. ఇక్కడే పాత్రల మధ్య సంఘర్షణ పతాక స్థాయికి చేరుకుంటుంది. ఎక్కడ కూడా బిగి సడలకుండా, కథలో వచ్చే అనూహ్యమైన మలుపులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. క్లైమాక్స్ సన్నివేశాలు కూడా చాలా సంతృప్తికరంగా ఉంటాయి.
ఇక నటీనటుల విషయానికి వస్తే శ్రీవిష్ణు తన నటనతో ఈ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. గత చిత్రాల్లోని కామెడీ లేదా హుషారును ఏమాత్రం తీసుకురాకుండా, జై పాత్రకు అవసరమైన గంభీరతను, మేధస్సును ప్రదర్శించారు. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో ఆయన చూపిన బాడీ లాంగ్వేజ్ మరియు సీరియస్ ఎక్స్‌ప్రెషన్స్ బాగున్నాయి.
రెబా మోనికా జాన్ ఐపీఎస్ అధికారి పాత్రలో హుందాగా నటించారు. కథలో అనవసరమైన ప్రేమకథలు లేదా డ్యూయెట్లకు తావు లేకుండా, పాత్ర పరిధిలో ఒదిగిపోయారు.ప్రతినాయకుడిగా వీర్ ఆర్యన్ నటన ఆకట్టుకుంటుంది. కథానాయకుడికి దీటుగా మైండ్ గేమ్ ఆడే విలన్‌గా, కొన్ని సన్నివేశాల్లో భయపెట్టేలా ఆయన చేసిన నటన సినిమా స్థాయిని పెంచింది.సుదర్శన్, చిన్నా, బాలాదిత్య మరియు రచ్చ రవి వంటి నటులు తమ పాత్రల పరిధిలో మంచి నటనను ప్రదర్శించి కథను ముందుకు తీసుకెళ్లడంలో సహకరించారు.
ఇక టెక్నికల్ గా కూడా సినిమా ఉన్నంతగా వుంది. దర్శకుడు హుస్సేన్ షా కిరణ్, సుకుమార్ గారి వద్ద పనిచేసిన అనుభవంతో కథను ఉత్కంఠభరితంగా మలిచారు. ముఖ్యంగా హీరో, విలన్ మధ్య సాగే మైండ్ గేమ్ కథకు ప్రధాన బలం. కాలభైరవ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ సన్నివేశాలకు ప్రాణం పోసింది. ఉత్కంఠను పెంచడంలో సంగీతం కీలక పాత్ర పోషించింది.విద్యా సాగర్ చింత సినిమాటోగ్రఫీ సినిమాకు అవసరమైన గంభీరమైన మూడ్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది.శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ షార్ప్ గా వుంది. దీనివల్ల ప్రేక్షకులు ఎక్కడా బోర్ ఫీల్ అవ్వరు. నిర్మాతలు సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మాణం రిచ్ గా వుంది.
ఓవరాల్ గా మృత్యుంజయ్’ ఒక పక్కా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. శ్రీవిష్ణు తన కామెడీ ఇమేజ్‌ను పక్కనపెట్టి, గంభీరమైన పాత్రలో కొత్తగా కనిపించారు. అనవసరమైన డ్యూయెట్లు లేదా ఇతర గ్లామర్ అంశాలకు తావు లేకుండా, కేవలం కథ మరియు స్క్రీన్‌ప్లే మీదనే దర్శకుడు దృష్టి పెట్టడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి, అలాగే మైండ్ గేమ్స్ ఉండే కథలను చూసే వారికి ఈ సినిమా కచ్చితంగా మంచి అనుభూతిని ఇస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























