ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న తాజా చిత్రంఎపిక్ : ‘ఫస్ట్ సెమిస్టర్’ . ‘బేబీ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాట అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘సంచారమే’ అని సాగే ఈ మొదటి పాటను మార్చి 7వ తేదీన ఉదయం 11:08 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ పాట ఒక అందమైన ప్రేమ ప్రయాణాన్ని ఆవిష్కరించబోతోందని మేకర్స్ పేర్కొన్నారు.
‘ఖుషి’, ‘హాయ్ నాన్న’ వంటి ఫీల్ గుడ్ ఆల్బమ్స్ అందించిన హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.ప్రజాకవి గోరెటి వెంకన్న ఈ పాటను రచించడం విశేషం. ఆయన కలం నుండి వచ్చే పదాలు ఈ పాటకు ప్రాణం పోస్తాయని అభిమానులు భావిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ , గోరెటి వెంకన్న ఈ పాటను పాడారు.
’90’s – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































