బ్యాండ్ మేళం సెకండ్ సింగిల్ డేట్ ఫిక్స్

Band Melam Second Single Release Date Announced

కోన వెంకట్ సమర్పణలో హర్ష్ రోషన్ మరియు శ్రీదేవి అపల్ల జంటగా నటిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘బ్యాండ్ మేళం’ చిత్రం నుండి సెకండ్ సింగిల్ అప్‌డేట్ వచ్చేసింది.ఈ చిత్రంలోని రెండవ పాటను ఫిబ్రవరి 28న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.మాస్ మహారాజ్ రవితేజ ఈ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే విడుదలైన మొదటి పాట “తిప్పుకుంటన్నవ్” భారీ వ్యూస్ సాధించి చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ పాటను అనిల్ రావిపూడి చేతుల మీదుగా విడుదల చేశారు.

‘కోర్ట్’ సినిమా సూపర్ హిట్ సెంటిమెంట్‌ను అనుసరిస్తూ, ‘బ్యాండ్ మేళం’ చిత్రాన్ని మార్చి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఇంతకుముందు హర్ష్ రోషన్ – శ్రీదేవి జంటగా నటించిన ‘కోర్ట్’ చిత్రం గత ఏడాది మార్చి 14న విడుదలై ఘనవిజయం సాధించింది. ఇప్పుడు కోర్ట్ కన్నా ఒక్క రోజు ముందే వస్తున్న బ్యాండ్ మేళం కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని చిత్ర నిర్మాత కోన వెంకట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.