హే బల్‌వంత్ ఫస్ట్ డే కలెక్షన్స్

hey balavanth day 1 box office collections

యంగ్ హీరో సుహాస్, శివానీ నాగరం జంటగా నటించిన తాజా చిత్రం ‘హే బల్‌వంత్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఆశాజనకమైన వసూళ్లను సాధించింది. చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ సినిమా తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా ₹2.14 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రీమియర్ షోల నుండి పాజిటివ్ టాక్ రావడంతో మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఇండియాలో ఈ చిత్రం సుమారు ₹80 నుండి ₹90 లక్షల నెట్ కలెక్షన్లను సాధించగా, ఓవర్సీస్ మార్కెట్లో సుమారు 72 వేల డాలర్ల వసూళ్లను నమోదు చేసింది. సుహాస్ గత చిత్రం ‘ఓ భామ అయ్యో రామా’తో పోలిస్తే, ‘హే బల్‌వంత్’ మూడు రెట్లు మెరుగైన ఓపెనింగ్స్ సాధించడం విశేషం.

గోపీ అచ్చర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక ఎమోషనల్ కామెడీ డ్రామాగా ప్రేక్షకులను అలరిస్తోంది. తండ్రీకొడుకుల అనుబంధం, బిజినెస్ నేపథ్యంలో సాగే కథ కావడంతో కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమా పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. వీకెండ్ కావడంతో రెండో రోజు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.