శర్వానంద్ హీరోగా యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘బైకర్’ బిజినెస్ పరంగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలను దృష్టిలో ఉంచుకుని, ప్రముఖ నిర్మాత దిల్ రాజు బైకర్ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను సుమారు 23 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్నారు.దాంతో శర్వానంద్ కెరీర్‌లోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థియేట్రికల్ డీల్ గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యూవీ క్రియేషన్స్ మేకింగ్ వాల్యూస్ మరియు శర్వానంద్‌కు ఉన్న మార్కెట్ ఇమేజ్‌ను నమ్మి దిల్ రాజు ఈ స్థాయిలో పెట్టుబడి పెట్టడం విశేషం.శర్వానంద్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు.
ఈ సినిమా ఒక హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా, బైక్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇక దిల్ రాజు ఈ సినిమా పంపిణీ బాధ్యతలు చేపట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని థియేటర్లలో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉంది.
ఇందులో ప్రముఖ సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుండగా గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 3 న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























