ఆది పినిశెట్టి మరకతమణి 2 గ్రాండ్ గా ప్రారంభం

Aadhi Pinisetty’s Maragatha Mani2 Launched Grandly

2017లో విడుదలై తన మ్యాజికల్ కాన్సెప్ట్, కామెడీతో ఫాంటసీ కామెడీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం మరకతమణి. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా సీక్వెల్ ‘మరకతమణి 2’ అధికారికంగా ప్రారంభమైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శివరాత్రి శుభ సందర్భంగా ఈ చిత్రం షూటింగ్ చెన్నైలో జరిగిన పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. హీరో కార్తీ క్లాప్‌ కొట్టగా, హీరో ఆర్య, దర్శకుడు వెంకట్ ప్రభు “కెమెరా రోలింగ్, యాక్షన్” అంటూ షూటింగ్ ప్రారంభించారు. యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీతో అనుబంధం వున్న అనేక మంది ప్రముఖలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ప్యాషన్ స్టూడియోస్, దంగల్ టీవీ, ఆర్‌డిసి మీడియా, యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, గుడ్ షో బ్యానర్‌లపై సుధన్ సుందరం, మనీష్ సింఘాల్, దుర్గారం చౌదరి, దేవ్ & కెవి దురై నిర్మిస్తున్న ఈ చిత్రానికి గత బ్లాక్ బస్టర్ ‘మరకతమణి’కి దర్శకత్వం వహించిన ఎఆర్‌కె శరవణ్ దర్శకత్వం వహిస్తున్నారు.

మరకతమణి 2లో ఆది పినిశెట్టి, సత్యరాజ్, ప్రియా భవాని శంకర్, నిక్కీ గల్రానీ పినిశెట్టి, మునిష్కాంత్, ఆనందరాజ్, డానీ, అరుణ్‌రాజా కామరాజ్, మురుగానందం కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతిక విభాగంలో ధిబు నినన్ థామస్ సంగీతాన్ని అందిస్తుండగా, పీవీ శంకర్ సినిమాటోగ్రఫీ, ఎన్‌కే రాహుల్ ఆర్ట్ డైరెక్షన్, తిరుమలై రాజన్ ఆర్ ఎడిటింగ్, రాజేష్ కన్నన్ డైలాగ్స్, పీసీ స్టంట్స్ యాక్షన్ నిర్వహిస్తున్నారు.

అనౌన్స్మెంట్ నుంచి అంచనాలు భారీగా పెరగడంతో, మరకతమణి 2 మరింత వినోదం, మ్యాజిక్, థ్రిల్లింగ్ అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది. చిత్రీకరణ విరామం లేకుండా కొనసాగనుండగా, త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ రివిల్ చేయబోతున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.