హే భగవాన్! కాస్త హే బలవంత్! గా మార్పు

Hey Bhagavan! Undergoes a Title Change to Hey Balavanth

సుహాస్ హీరోగా నటించిన ‘హే భగవాన్’ చిత్రానికి సెన్సార్ బోర్డు (CBFC) అభ్యంతరం వ్యక్తం చేయడంతో, తాజాగా ఈ టైటిల్‌ను ‘హే బలవంత్!’ గా మార్చారు. సినిమా విడుదలకు కేవలం 4 రోజుల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దేవుడి పేరుతో ఉన్న టైటిల్ వల్ల కొన్ని వర్గాల సెంటిమెంట్స్ దబ్బతినే అవకాశం ఉందని భావించిన సెన్సార్ బోర్డు, పేరు మార్చాలని సూచించింది.

ఇటీవల ఛాయ్ వాలా(నవాబ్ కేఫ్ మార్చారు) ‘కపుల్ ఫ్రెండ్లీ’ మరియు ‘వానర’ (వనవీరగా మార్చారు) వంటి చిన్న సినిమాలకు కూడా ఇలాంటి టైటిల్ ఇబ్బందులు ఎదురయ్యాయి.

హే బలవంత్! లో సుహాస్, శివానీ నాగారం జంటగా నటించారు. ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా.ఇందులో సీనియర్ నటుడు నరేష్, వెన్నెల కిషోర్, సుదర్శన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.గోపీ అచ్చర దర్శకత్వం వహించగా, త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి నిర్మించారు.

ఈ చిత్రం ఫిబ్రవరి 20, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఇదొక పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. తండ్రీకొడుకుల మధ్య ఉండే ఎమోషన్స్ మరియు ఫ్యామిలీ బిజినెస్ నేపథ్యంలో సాగే కామెడీ డ్రామాగా తెరకెక్కింది.బన్నీ వాసు మరియు వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.