కల్ట్ థ్రిల్లర్ ‘దృశ్యం ఫ్రాంచైజీలోని మూడో భాగం ‘దృశ్యం 3’ విడుదల తేదీ ఖరారైయింది. మాతృక మలయాళ వెర్షన్ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు జీతూ జోసెఫ్, సూపర్ స్టార్ మోహన్‌లాల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.2013 లో దృశ్యం సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆ తరువాత తెలుగు , హిందీ . తమిళ భాషల్లో రీమేక్ అయ్యి అదే ఫలితాన్ని రిపీట్ చేసింది. ఇకదృశ్యం కోవిద్ కారణంగా డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు దృశ్యం 3 రానుంది.
ఇదిలావుంటే అజయ్ దేవగణ్ హీరోగా నటించే హిందీ ‘దృశ్యం 3’ కూడా విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఈ సినిమా అక్టోబర్ 2, 2026న (గాంధీ జయంతి కానుకగా) విడుదల కానుంది.రీసెంట్ గానే షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు.
అయితే విక్టరీ వెంకటేష్ నటించాల్సిన తెలుగు ‘దృశ్యం 3’పై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ (హౌస్ నెం. 47) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. నిర్మాత సురేష్ బాబు ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, త్రివిక్రమ్ సినిమా పూర్తయిన తర్వాతే ‘దృశ్యం 3’ పనులు మొదలవుతాయని పేర్కొన్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, తెలుగు వెర్షన్‌ను కూడా హిందీ వెర్షన్‌తో పాటు అక్టోబర్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, వెంకటేష్ కాల్‌షీట్స్ కారణంగా సినిమా ఆలస్యం కావచ్చని లేదా తదుపరి ప్రాజెక్టుల వల్ల కొంత సందిగ్ధత ఉందని కూడా వార్తలు వస్తున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























