టాక్సిక్ ఓవర్సీస్ రైట్స్ సొంతం చేసుకున్న ఫార్స్ ఫిలిం

Toxic Overseas Rights Bagged by Phars Films

కన్నడ స్టార్ యష్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టాక్సిక్’. ఈ సినిమా ఓవర్సీస్ (విదేశీ) హక్కులకు సంబంధించిన డీల్ పూర్తయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఫార్స్ ఫిలిం (Phars Film) ఈ సినిమా థియేట్రికల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. సుమారు 80 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల మధ్య ఈ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. కన్నడ సినిమా చరిత్రలోనే ఇది అత్యధిక ఓవర్సీస్ బిజినెస్ అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘కేజీఎఫ్’ సిరీస్‌తో యష్‌కు అంతర్జాతీయంగా వచ్చిన గుర్తింపు కారణంగానే ఈ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది.ఇక రీసెంట్ గా తెలుగు రాష్ట్రాల హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రికార్డు ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అన్ని భాషల్లో టాక్సిక్ రికార్డు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది. నాలుగేళ్ళ తరువాత యష్ నుండి వస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ పై భారీ అంచనాలు వున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్ణాటక మరియు ముంబై పరిసరాల్లో శరవేగంగా జరుగుతోంది. ఇందులో కియారా అద్వానీ ,నయనతార,రుక్మిణి వసంత్ ,హ్యూమా ఖురేషి కీలక పాత్రల్లో నటిస్తుండగా రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు.కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈసినిమా మార్చి 19న విడుదలకానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.