డిఫరెంట్ ఎంటర్టైనర్స్ తో అలరిస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి మరో యూనిక్ మూవీతో రావోతున్నారు. ‘గాయపడ్డ సింహం’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న పవన్ సాదినేని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. విద్యా సాగర్ చింత సినిమాటోగ్రఫీ, స్వీకర్ అగస్తి సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకు విప్లవ్ నైషధం ఎడిటింగ్, చంద్రిక గొర్రెపాటి ప్రొడక్షన్ డిజైనింగ్ నిర్వహిస్తుండగా.. సూర్య ప్రకాష్ జ్యోసుల కథను అందించారు.
2026 వేసవిలో సినిమా విడుదల అవనుంది. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన టైటిల్ పోస్టర్‌తో బజ్‌ను సృష్టించిన ఈ టీం, ఇప్పుడు ఫన్ ఫిల్డ్ ట్రైజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ట్రైజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. “కొంతమందికి అమెరికా వెళ్లాలని లక్ష్యం ఉంటుంది. నా ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది వున్నారు. కానీ వీసాలు చాలాసార్లు రిజెక్ట్ అవుతుంటాయి.”
“దానికి చాలా నవ్వుకునే కారణాలు ఉంటాయి. నిజంగా అదొక ప్రపంచం. ఇలాంటి కథతో కశ్యప్ వచ్చినప్పుడు ఆ కథ చెప్పినప్పుడే విపరీతంగా ఎంజాయ్ చేశాను. ఆ యూనిక్ ట్రీట్మెంట్ కి ఫిదా అయిపోయాను. ఆడియన్స్ కూడా ఫిదా అవుతారని నమ్మకం ఉంది.కశ్యప్ చాలా యూనిక్ వాయిస్ ఉన్న డైరెక్టర్. తన సెన్సాఫ్ హ్యూమర్ చాలా యూనిట్ గా ఉంటుంది. తనకి ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంది.”
“స్క్రీన్ లో చూసినప్పుడు నవ్వుతూనే ఉంటారు. మా ప్రొడ్యూసర్స్ కి థాంక్యూ. పవన్ తను ఏదైనా అనుకుంటే కచ్చితంగా సాధిస్తాడు.తను సినిమాని ప్రజెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాచేయడం ఒక మంచి అవకాశం గా భావిస్తున్నాను. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ధియేటర్లో లాఫ్ రైడ్ ఉంటుంది. ఫారియాతో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఒక డాన్స్ నెంబర్ ఉంది. అందులో నాకు చాలా హెల్ప్ చేసింది. చాలా మంచి సినిమా. ఎవరు మిస్ అవ్వకూడదని కోరుకుంటున్నాను.” అని తెలిపారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























