ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్న భారీ చిత్రం ‘వారణాసి’ గురించి గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న పుకార్లకు దర్శకుడు స్వయంగా తెరదించారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందన్న ప్రచారాన్ని తోసిపుచ్చుతూ, ‘వారణాసి’ కేవలం సింగిల్ పార్ట్ (ఒకే భాగం) గానే రూపొందుతోందని ఆయన స్పష్టం చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా హాలీవుడ్ మీడియాతో మాట్లాడిన రాజమౌళి, కథా విస్తృతి దృష్ట్యా మొదట్లో ఈ సినిమాను రెండు భాగాలుగా చేయాలని ఆలోచించామని, కానీ తర్వాతి చర్చల్లో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు వెల్లడించారు. కథలోని భావోద్వేగాలు మరియు యాక్షన్ సీక్వెన్స్‌లను ఒకే భాగంలో ఎంతో సమర్థవంతంగా చూపించవచ్చని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ చిత్రం సుమారు 3 గంటల నిడివితో ఉండబోతోంది. బాహుబలి తరహాలో పార్ట్-1, పార్ట్-2 ఉంటుందని ఆశించిన అభిమానులకు ఇది కొంత ఆశ్చర్యాన్ని కలిగించినా, రాజమౌళి క్లారిటీ ఇవ్వడంతో సస్పెన్స్‌కు తెరపడింది.
మహేష్ బాబు ‘రుద్ర’ అనే పాత్రలో, ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే విలన్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్-వరల్డ్ అడ్వెంచర్ ఏప్రిల్ 7, 2027న ఉగాది కానుకగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌తో పాటు అంతర్జాతీయ లోకేషన్లలో శరవేగంగా జరుగుతోంది. గ్లింప్స్‌లో కనిపించిన విజువల్స్ చూస్తే, ఒకే భాగంలో రాజమౌళి ఎంతటి విజువల్ వండర్‌ను చూపించబోతున్నారో అర్థమవుతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























