మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ డిజిటల్ సందడికి సిద్ధమైంది.ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ జీ 5 భారీ ధరకు కైవసం చేసుకుంది.తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఫిబ్రవరి 11 నుండి స్ట్రీమింగ్ లోకి రానుంది. తెలుగు తోపాటు కన్నడ , మలయాళ ,తమిళ , హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ మరియు చిరంజీవి వింటేజ్ మాస్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు 370 కోట్లకుపైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది.ఇప్పటికీ ఈసినిమా థియేటర్లలో మంచి వసూళ్లను రాబడుతుంది. ఇక ఈసినిమాతో చిరంజీవి కెరీర్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. అంతేకాదు ఓవర్సీస్ లో 4.5 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టి కెరీర్ హైయెస్ట్ ఓవర్సీస్ గ్రాసర్ గా నిలిచింది. మరోవైపు ఈసినిమాతో అనిల్ రావిపూడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు. తనకు వరుసగా ఇది 9వ విజయం.
ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార నటించగా, విక్టరీ వెంకటేశ్ ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్‌లో కనిపించి ప్రేక్షకులను అలరించారు. షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























