ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు మా జీవితానికి వరం – రామ్ చరణ్

Our Lives Are Complete With Two Daughters and a Son says Ram Charan

రామ్ చరణ్, ఉపాసన నిన్న రాత్రి అపోలో ఆసుపత్రిలో కవలలు- ఒక పాప, ఒక బాబుకు జన్మనివ్వడంతో మెగా కుటుంబంలో ఆనందం రెట్టింపు అయ్యింది. కొణిదెల, కామినేని కుటుంబాల్లో సంబరాలు మొదలయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రామ్ చరణ్ ఈ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ.. “మాకు ఒక బాబు, ఒక పాప జన్మించారని తెలియజేయడం ఎంతో సంతోషంగా ఉంది. మా జీవితాల్లో మహిళలే మా గొప్ప బలం. ప్రతి క్షణం మా వెంట నిలిచిన అభిమానులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు” తెలియజేశారు.

డెలివరీకి ముందు తీసుకున్న ఫ్యామిలీ ఫోటో ఇప్పుడు మరింత ప్రత్యేకంగా మారింది. ఆల్-బ్లాక్ అవుట్‌ఫిట్స్‌లో చరణ్, ఉపాసన ప్రశాంతంగా ఆనందాన్ని వెదజల్లుతూ కనిపించారు. ఫ్లోయింగ్ గౌన్‌లో ఉపాసన మెరవగా, చరణ్ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నారు.

ఆ ఫోటోకు పర్శనల్ టచ్ ని జోడిస్తూ వారి బ్లాక్ డాగ్స్ ఇరువైపులా కూర్చొని, కుటుంబంలో ఉన్న స్నేహం, ఐక్యత, ఎదురుచూపులను అందంగా ప్రతిఫలించాయి.

కవలల రాకతో మెగా కుటుంబంలో సంబరాలు డబుల్ అయ్యాయి. ఇది రామ్ చరణ్–ఉపాసన జీవితాల్లో ఒక మధురమైన కొత్త అధ్యాయానికి ఆరంభం. అభిమానులు, శ్రేయోభిలాషులు తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు ఆసుపత్రి వద్దకు చేరుకొని శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.