మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. ఈ చిత్రం విదేశాల్లో ఇప్పటివరకు $4.5 మిలియన్ డాలర్ల (సుమారు ₹41 కోట్లు) మార్కును దాటి దూసుకుపోతోంది.చిరు , అనిల్ రావిపూడి కెరీర్ లోనే ఈసినిమా హైయెస్ట్ ఓవర్సీస్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. అటు అమెరికా మార్కెట్లో ఈ సినిమా ఇప్పటికే $3 మిలియన్ డాలర్ల క్లబ్లో చేరిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటికే ₹350 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, రీజనల్ సినిమాల్లో ఆల్-టైమ్ రికార్డు నెలకొల్పింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఓవర్సీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఇది $5 మిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో మెరిశాడు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా షైన్ స్క్రీన్స్ ,గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మించాయి.మరో కొన్ని వారాలవరకు పెద్ద సినిమాల విడుదల లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద మన శంకర వరప్రసాద్ హవా కొనసాగనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























