ఆకాశంలో ఒక తార నుండి శృతి హాసన్ ఫస్ట్ లుక్ రిలీజ్

First Look of Shruti Haasan from Aakashamlo Oka Tara Is Out

దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా పవన్ సాదినేని దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’ నుండి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న శృతి హాసన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.ఇంతకుముందే ఈ న్యూస్ బయటికి రాగ ఈరోజు తన బర్త్ డే కావడంతో ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేసి అఫిషియల్ గా ప్రకటించింది చిత్ర బృందం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాలో శృతి హాసన్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.విడుదలైన రెండు పోస్టర్లలో ఒకదానిలో ఆమె సిగరెట్ తాగుతా సీరియస్ గా వర్క్ చేసుకుంటూ కనిపించగా మరొక పోస్టర్ లో స్టైలిష్ లుక్ లో గ్లామరస్ గా కనిపించింది.ఇప్పటికే ఈ సినిమా నుండి హీరోయిన్‌గా పరిచయమైన సాత్విక వీరవల్లి గ్లింప్స్‌కు మంచి స్పందన రాగా, శృతి హాసన్ ఎంట్రీతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సాత్విక ఇందులో అంతరిక్షంలోకి వెళ్లాలని కలలుగనే ఒక పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తుండగా, శృతి పాత్ర ఆమె ప్రయాణంలో ఎలా తోడ్పడుతుందనేది ఆసక్తికరంగా మారింది.

వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 సమ్మర్ కానుకగా తెలుగు, మలయాళం, తమిళం మరియు హిందీ భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.