సక్సెస్ ఎప్పుడూ కూడా బోర్ కొట్టదు – చిరంజీవి

Success Is Never Boring Says Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ల ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అలరించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక నటించారు. శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేశారు. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ (రీజనల్ ఫిల్మ్స్) సెలబ్రేషన్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో సినిమా యూనిట్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కి షీల్డ్స్ అందించారు. దర్శకులు కె రాఘవేంద్రరావు, వివి వినాయక్, నిర్మాత దిల్ రాజు, సుప్రియ యార్లగడ్డ పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ (రీజనల్ ఫిల్మ్స్) సెలబ్రేషన్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. మీ ఆనందంలో సక్సెస్ ని ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చి గత వైభవాన్ని మళ్లీ పునరావృతం చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా విజయాన్ని చూసి సుస్మిత చాలా ఎక్సైటింగ్ గా నాతో మాట్లాడింది. ఇలాంటి విజయాలు మీకు కామన్ అని చెప్పింది. సక్సెస్ ఎప్పుడూ కూడా బోర్ కొట్టదు.

మనం ప్రతిరోజు తినే అన్నం కూర మనకు ఎలా అయితే బోర్ కొట్టవో విజయం ఇచ్చే ఉత్సాహం ఎప్పుడూ కూడా అద్భుతంగా ఉంటుంది. సీనియారిటీతో మెచ్యూరిటీ రావడంతో ఒక్కొక్కలా స్పందిస్తాం తప్పితే మీరందరూ ఈ విజయాన్ని ఎంతలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంతకంత మనసులో నేను ఆస్వాదిస్తున్నాను. ప్రజల్లోకి వెళ్ళండి వాళ్లతో ఇంట్రాక్ట్ అవ్వండి ప్రేక్షకులు ఇచ్చే కిక్కు వేరే ఉంటుందని అనిల్, సాహు తో చెప్పాను. వాళ్ళు ఇచ్చే ఉత్సాహం భవిష్యత్తులో చేసే సినిమాలకి ఒక ఇంధనం లాగా పనిచేస్తుంది. ఇలాంటి ప్రేమని నేను ఎన్నోసార్లు అనుభవించాను. అలాంటి ఉత్సాహం చాలా సంవత్సరాల తర్వాత పునరావృతం కావడం ఎంతో ఆనందంగా ఉంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.