కోలీవుడ్ హీరో కార్తీ ,యంగ్ హీరోయిన్ కృతి శెట్టి జంటగా నటించిన క్రేజీ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘వా వాతియార్’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను అందుకున్నప్పటికీ కార్తీ నటన ,కామెడీ టైమింగ్‌కు మంచి ప్రశంసలు దక్కాయి.అయితే తెలుగు లో ఈసినిమాను అన్నగారు వస్తారు అనే టైటిల్ తో విడుదల చేద్దాం అనుకున్నారు కానీ కుదరలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది.దాంతో ఈరోజు అర్ధరాత్రి నుండి ఈసినిమాను ప్రైమ్ స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.తమిళం,తెలుగుతో పాటు మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుంది.కేవలం రెండు వారాల్లోనే ఈసినిమా ఓటీటీలోకి వస్తుంది.
నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తీ ఒక ఎంజీఆర్ అభిమానిగా మరియు పోలీస్ ఆఫీసర్‌గా ద్విపాత్రాభినయం తరహాలో అలరించారు. సత్యరాజ్, రాజ్‌కిరన్ కీలక పాత్రల్లో నటించగా సంతోష్ నారాయణన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.ఆర్థిక మరియు చట్టపరమైన సమస్యల వల్ల పలుమార్లు వాయిదా పడి చివరకు సంక్రాంతికి విడుదలైన ఈచిత్రం, ఇప్పుడు ఓటీటీ ద్వారా మరింత మంది ప్రేక్షకులను చేరువ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























