మోహన్‌లాల్‌ హీరోగా విష్ణు మోహన్ దర్శకత్వంలో శ్రీ గోకులం మూవీస్ భారీ బడ్జెట్ మూవీ అనౌన్స్‌మెంట్

“Sri Gokulam Movies Announces a Big-Budget Film with Mohanlal, Directed by Vishnu Mohan

మోహన్‌లాల్ కథానాయకుడిగా శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌పై నిర్మాత గోకులం గోపాలన్ నిర్మిస్తున్న కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.  జాతీయ అవార్డు గెలుచుకున్న తన తొలి చిత్రం ‘మెప్పాడియన్’తో బలమైన ముద్ర వేసిన విష్ణు మోహన్ ఈ చిత్రానికి కథ అందించి దర్శకత్వం వహించనున్నారు. భారీ స్థాయిలో నిర్మితమవుతున్న L367, శ్రీ గోకులం మూవీస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ మూవీ. ఈ ప్రాజెక్ట్‌కు బైజు గోపాలన్,  వి సి ప్రవీణ్ సహ నిర్మాతలుగా వ్యవహరించనుండగా, కృష్ణమూర్తి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ కాన్వాస్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఫారిన్, బాలీవుడ్ ప్రముఖ నటీనటులు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు కలిసి పనిచేయనున్నారు. చిత్ర బృందం త్వరలోనే షూటింగ్ ప్రారంభించనుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు

ప్రస్తుతం శ్రీ గోకులం మూవీస్ నిర్మాణంలో సురేష్ గోపి నటించిన ఒట్టకొంబన్, జయరామ్-కాళిదాస్ జయరామ్ ఆశకల్ ఆయిరం, జయసూర్య నటించిన కథనార్, నివిన్ పౌలీ-బి ఉన్నికృష్ణన్ చిత్రం, ఎస్ జె సూర్య దర్శకత్వం వహించిన కిల్లర్ వంటి అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ జాబితాలో L367 కూడా చేరడంతో ఈ బ్యానర్ మలయాళ సినిమా రంగంలో ఒక శక్తివంతమైన నిర్మాణ సంస్థగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.