ఆడియన్స్ రియాక్షన్స్ చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది – రామ్ అబ్బరాజు

director ram abbaraju's Speech at the Sankranthi Winner Blockbuster Event

ఈ సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు హీరో శర్వానంద్. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈసినిమాను నిర్మించారు. సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు.మరో హీరో శ్రీ విష్ణు క్యామియో రోల్ లో మెరిశాడు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచి హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో టీం అందరినీ షీల్డ్స్ అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసందర్బంగా డైరెక్టర్ రామ్ అబ్బరాజు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సినిమా అందరూ అద్భుతంగా ఎంజాయ్ చేశారు. ఆడియన్స్ రియాక్షన్స్ చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పుడు స్క్రీన్ అన్ని పెరుగుతున్నాయి. ఇది మాకు సెకండ్ రిలీజ్ డేట్ లాగా అనిపిస్తుంది. మళ్ళీ లాంగ్ వీకెండ్ రాబోతుంది. అందరూ కూడా సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. మా రైటర్స్ భానునందుకు థాంక్యూ. అద్భుతమైన స్క్రిప్ట్ ఇచ్చారు. నరేష్ గారు క్యారెక్టర్ అద్భుతంగా వర్కౌట్ అయింది.

అలాగే సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. మా హీరోయిన్స్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఏకే ప్రొడక్షన్స్ అంటే నాకు ఫ్యామిలీ ప్రొడక్షన్ లాంటిది. అనిల్ గారి సపోర్ట్ కి థాంక్యూ. శర్వా గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా రిలీజ్ తర్వాత ఆయన్ని చూసిన మూమెంట్ ఎప్పటికీ మర్చిపోలేను. అది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ. శ్రీ విష్ణు గారికి థాంక్ యూ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.