స్లమ్ డాగ్ లో కన్నడ స్టార్ దునియా విజయ్

Duniya Vijay Plays a Key Role in Slum Dog

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరియు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్టు ‘స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్’ నుండి ఒక సంచలన అప్‌డేట్ వెలువడింది. ఈ చిత్రంలో కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ దునియా విజయ్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈరోజు తన బర్త్ డే సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ఈ సినిమాలో దునియా విజయ్ రోల్ ప్రేక్షకులను అలరించబోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా విడుదలైన పోస్టర్‌లో దునియా విజయ్ ఎంతో స్టైలిష్‌గా, వెస్ట్రన్ కౌబాయ్ తరహా గెటప్‌లో కనిపిస్తున్నారు. తలకు హ్యాట్ ధరించి, చేతిలో గన్ పట్టుకుని, కళ్ళజోడుతో ఉన్న ఆయన లుక్ చూస్తుంటే పూరి జగన్నాథ్ తన మార్కు మాస్ ఎలిమెంట్స్‌ను ఆయన పాత్రలో పుష్కలంగా జోడించినట్లు స్పష్టమవుతోంది. కన్నడలో తనదైన నటనతో ‘దునియా’ చిత్రంతో సెన్సేషన్ సృష్టించిన ఆయన, ఇప్పుడు తెలుగులో బిజీ అవుతున్నాడు. ఇంతకుముందు బాలకృష్ణ , వీరసింహ రెడ్డి లోకూడా దునియా విజయ్ కీలకం పాత్రలో కనిపించాడు.ఇక ఇప్పుడు స్లమ్ డాగ్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువకానున్నాడు.

https://telugu.thetelugufilmnagar.com/2026/01/20/స్లమ్-డాగ్-లో-కన్నడ-స్టార/(opens in a new tab)

ఇక గతేడాది జూలైలో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ కేవలం ఐదు నెలల్లోనే పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటి టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదల తేదీని ప్రకటించనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.