మాస్ మహారాజా రవితేజ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించారు. జనవరి 13న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ మీట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ మీట్ లోమాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ… అందరికీ హయ్. చాలా హ్యాపీగా ఉంది. ఆర్ డైరెక్టర్ ప్రకాష్, డిఓపి ప్రసాద్ తో ఎన్నో ఏళ్ళుగా వర్క్ చేస్తున్నాను. వాళ్ళతో కలిసి మరోసారి పనిచేయడం ఎంత ఆనందాన్నిచ్చింది. ప్రసాద్ సినిమాని చాలా కలర్ ఫుల్ గా తీశారు. మురళీధర్ గౌడ్ గారు అద్భుతంగా చేశారు. తన జోక్స్ కి థియేటర్స్ లో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే కిషోర్ సత్య గెటప్ శీను వాళ్ళ అందరితో చాలా బాగా ఎంజాయ్ చేశాను. సునీల్ తో నాకు చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. దుబాయ్ శీను తర్వాత మళ్లీ అంతలా ఎంజాయ్ చేశాను. ప్రతి సీను విపరీతంగా ఎంజాయ్ చేశా. తనతో మళ్ళీ మళ్ళీ ఇలాంటి సినిమాలు చేయాలని ఉంది. నిర్మాత సుధాకర్ కంగ్రాజులేషన్స్.
సినిమా చాలా అద్భుతంగా ఉంది. సంక్రాంతికి ఫుల్ ఎంటర్టైన్మెంట్. అన్ని సినిమాలతో పాటు మా సినిమా కూడా చాలా బాగుంది. ఈ సినిమాని హిట్ చేసిన ప్రేక్షక మహాశయులకు కృతజ్ఞతలు. సినిమాకి ఇంకా చాలా మంచి రన్ ఉంటుంది. డింపుల్ క్యారెక్టర్ అద్భుతంగా చేసింది. తన పాత్రకి చాలా మంచి పేరు వచ్చింది. తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఆషిక కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. అందరు కూడా కామెడీ చాలా ఆర్గానిక్ గా ఉందని చెప్తున్నారు. డైరెక్టర్ కిషోర్ కి ఆర్గానిక్ కామెడీ టైమింగ్ ఉంది. బాలు మహేంద్ర గారు, జంధ్యాల గారు, క్రేజీ మోహన్ లాంటి ఫ్లేవర్ ఉన్న రైటింగ్ తనది. తన రైటింగ్ నాకు మొదటి నుంచి చాలా ఇష్టం. ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ అద్భుతంగా రాస్తాడు. ఇలాంటి సినిమా చేయాలని నాకు ఎప్పటినుంచో కోరిక. కిషోర్ సినిమాని తను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇలాంటి సినిమాలు మళ్లీ చేయాలని కోరుకుంటున్నాను. భీమ్స్ వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా మెయిన్ క్రెడిట్ కిషోర్ భీమ్స్ కి ఇస్తాను. అందరికీ థాంక్యూ సో మచ్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























