డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ , తమిళ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇప్పటివరకు పురిసేతిపతి అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి ‘స్లమ్ డాగ్’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు. దీనికి ‘33 టెంపుల్ రోడ్’ ట్యాగ్ లైన్. ఇక ఈసినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విజయ్ సేతుపతి ఎంతో పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. చేతిలో కత్తి పట్టుకుని, కళ్లజోడుతో ఉన్న ఆయన లుక్ చూస్తుంటే పూరి మార్కు మాస్ ఎంటర్టైనర్ అని స్పష్టమవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ పోస్టర్‌తో పాటు మేకర్స్ పంచుకున్న క్యాప్షన్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘మురికివాడల నుంచి ఎవరూ తట్టుకోలేని తుపాను వస్తుంది.. అది చాలా భయంకరంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. సో విజయ్ సేతుపతిని పూరి ఈసినిమాలో నెక్స్ట్ లెవెల్లో చూపించనున్నాడు . గతేడాది జూలైలో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ కేవలం ఐదు నెలల్లోనే కంప్లీట్ అయ్యింది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటి టబు మరియు విజయ్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు. సమ్మర్ లో థియేటర్లోకి తీసుకురావాలని చూస్తున్నారు.యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా జేబీ నారాయణ రావుతో కలిసి పూరి , ఛార్మి ఈసినిమాను నిర్మిస్తున్నారు.మరి ఈసినిమాతో పూరి జగన్నాథ్ కం బ్యాక్ ఇస్తాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























