చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం నారీ నారీ నడుమ మురారి.సామజవరగమన వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమాపై అంచనాలు పెంచేలా మేకర్స్ ప్రమోషన్లను వేగవంతం చేశారు. అందులో భాగంగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈనెల 22న ఈ టీజర్ విడుదలకానుంది.ఈ సందర్బంగా మేకర్స్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ టీజర్ ద్వారా సినిమా అసలు కథను మరియు శర్వానంద్ క్యారెక్టరైజేషన్‌ను పరిచయం చేయబోతున్నారు.ఈసినిమాలో సాక్షి వైద్య, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా శర్వానంద్‌కు సంక్రాంతి హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.ఈ సినిమాలో వెర్సటైల్ నటుడు శ్రీవిష్ణు ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం రావడంతో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది.సంక్రాంతి రేసులో ఇప్పటికే అనేక పెద్ద సినిమాలు ఉండగా, శర్వానంద్ తనదైన శైలిలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు.ఈ సినిమా విడుదలకు సంబంధించి ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు.జనవరి 14న సాధారణంగా ఉదయం షోలతో కాకుండా, సాయంత్రం 5:49 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోలతో ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























