హాఫ్ మిలియన్ మార్క్ చేరువలో ఆంధ్ర కింగ్ తాలూకా 

Andhra King Thaluka Nearing the Half-Million Mark

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన  ఆంధ్ర కింగ్ తాలుకా గత వారంలో  థియేటర్లలోకి వచ్చి  పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ మాత్రం  ఆశించినంతగా లేవు. అన్ సీజన్ లో విడుదలకావడంతో ఊహించిన విధంగా  కలెక్షన్స్ ను రాబట్టలేకపోతుంది.అయితే రెండో వారంలో సినిమా పూజనుకుంటుంటుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గాఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

  ఇక ఈసినిమా  నార్త్ అమెరికాలో నిన్నటి తో  475 k డాలర్లను  రాబట్టుకొని హాఫ్ మిలియన్ మార్క్ చేరుకోనుంది . అయితే  ఫుల్ రన్ లో ఈసినిమా అక్కడ 1 మిలియన్ క్లబ్ లో చేరడం  సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. రామ్ , భాగ్యశ్రీ  సినిమా విడుదలైన రోజునుండి యూఎస్ఏ చాలా ప్రమోట్ చేశారు. 

ఫ్యాన్ బయోపిక్  గా మహేష్ బాబు  పి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో భాగ్య శ్రీ బోర్సే  కథానాయికగా నటించగా  కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించారు. వివేక్ -మెర్విన్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ప్రస్తుతం మూవీ టీం తెలుగు రాష్ట్రాల్లో ప్రమోట్ చేస్తున్నారు. అయితే మరో రెండు రోజుల్లో అఖండ 2 విడుదలవుతుండడంతో ఆంధ్ర కింగ్ కు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఎదురుకానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.