సాధారణంగా తెలుగు సినిమాలు థియేటర్లలో కనీసం నాలుగు వారాలు పూర్తయిన తర్వాతే ఓటీటీలోకి వస్తాయి. అయితే రాజ్ తరుణ్, రాశి సింగ్ జంటగా నటించిన పాంచ్ మినార్ సినిమా ఆ రూల్‌ను పూర్తిగా బ్రేక్ చేసి, డిజిటల్ రిలీజ్‌తో సంచలనం సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాంచ్ మినార్ చిత్రం నవంబర్ 21, 2025న థియేటర్లలో విడుదల కాగా, కేవలం 7 రోజుల్లోనే అంటే ఈరోజు నుంచే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా థియేటర్లలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఓ సినిమా ఓటీటీ లో రిలీజ్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతూవుంటుంది.
రామ్ కడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా ఆకర్షించలేకపోయింది.దీనికి అనేక కారణాలు వున్నాయి.సరైన ప్రమోషన్లు లేకపోవడం, తక్కువ బజ్, మరియు అదే వారం విడుదలైన మిగితా సినిమాల నుండి పోటీ ఉండడంతో పాంచ్ మినార్ బాక్సాఫీస్ వద్ద నిలవలేకపోయింది. దాంతో మేకర్స్ వెంటనే ఓటీటీ విడుదలకు మొగ్గు చూపారు. ఈ చిత్రంలో రాజ్ తరుణ్, రాశి సింగ్‌తో పాటు బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి, సుదర్శన్, ఘోష్ కీలక పాత్రల్లో నటించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























