ది ప్యారడైజ్ కోసం భారీ సెట్

Big-Budget Set Erected for The Paradise Shoot

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి నాని లుక్, అలాగే ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న మోహన్ బాబు పోస్టర్‌లు ఇప్పటికే నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ చిత్రంలో జాతీయ అవార్డు గ్రహీత, నటి సోనాలి కులకర్ణి ఒక ముఖ్య పాత్ర పోషిస్తోంది. అలాగే కిల్ ఫేం రాఘవ్ జుయల్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. కేవలం కాస్టింగ్ తోనే భారీ హైప్ క్రియేట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా గురించి ఇప్పుడు మరో ఆసక్తికర వార్త నాని అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. అదేమిటంటే, ది ప్యారడైజ్ కోసం హైదరాబాద్‌లో ఏకంగా రూ.7.5 కోట్ల భారీ వ్యయంతో ఒక హౌస్ సెట్‌ను నిర్మిస్తున్నారట. ఈ సెట్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ను గుర్తుకు తెచ్చేలా అత్యంత అద్భుతంగా ఉంటుందని, దీన్ని అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మిస్తున్నారని ఇన్‌సైడ్ టాక్. సినిమాలో ఇది మోహన్ బాబు ఇల్లు. మొత్తానికి ఖర్చు వెనకాడకుండా భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నాడు సుధాకర్ చెరుకూరి.

ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతంతో అందిస్తుండడం తో ఆడియో పైకూడా భారీ అంచనాలు వున్నాయి. డిసెంబర్ చివరికల్లా లేదా జనవరి మొదట్లో ఈ సినిమా నుంచి మరో గ్లింప్స్ విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.జనవరి లోగా షూటింగ్ కంప్లీట్ చేసి సినిమాను అనుకున్న తేదీ మార్చి 26న విడుదలచేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.