ఇంత ప్రేమనిచ్చిన తెలుగు ఆడియన్స్ కి థ్యాంకు – మమితా బైజు 

Thankful to Telugu Audience for All the Love says Mamitha Baiju

ప్రదీప్ రంగనాథన్ హీరోగా  డైరెక్టర్ కీర్తిశ్వరన్ తెరకెక్కించిన సినిమా డ్యూడ్ . ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  ఈసినిమాను నిర్మించగా మమితా  బైజు  హీరోయిన్ గా  నటిచింది. ప్రముఖ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.అక్టోబర్ 17న  విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ డ్యూడ్ బ్లాక్ బస్టర్ 100 cr జర్నీ ఈవెంట్ ని నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ  ఈవెంట్ లో  హీరోయిన్ మామితా బైజు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సినిమా 100 కోట్లు కలెక్షన్స్ క్రాస్ చేసింది. ఇది మరింత స్పెషల్ మూమెంట్. అడియన్స్ సపోర్టుకి థాంక్యూ. వారి సపోర్ట్ లేకపోతే ఇది సాధ్యం కాదు. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. మై కోస్టార్ ప్రదీప్ కి, డైరెక్టర్ కీర్తికి థాంక్యూ సో మచ్ ఇంత ప్రేమనిచ్చిన తెలుగు ఆడియన్స్ కి థాంక్యూ.

ప్రేమలు తో  తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మమితా బైజు  ఇప్పుడు డ్యూడ్ తో మరింత ఫాలోయింగ్  పెంచుకుంది.ఈ రెండు సినిమాలు 100 కోట్ల పైనే రాబట్టుకున్నాయి.ఇక  మమిత ప్రస్తుతం సూర్య 46లో హీరోయిన్ గా నటిస్తుండగా  దళపతి విజయ్ జన నాయగన్ లో కీలక పాత్రలో కనిపించనుంది. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.