గతంలో చాలాసార్లు వచ్చిన కాన్సెప్ట్స్ ను మరలా టచ్ చేయాలంటే తను రూపొందించుకున్న కథాకథనాల మీద బోలెడంత కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్సెప్ట్ , జోనర్ పాతవే అయినప్పటికీ కథను కొత్తగా చెప్పగలం అనే నమ్మకమే 118 లాంటి డిఫరెంట్ ప్రయత్నాలకు పురిగొల్పుతుంది. ఈ రోజు విడుదలైన 118 హీరోగా నందమూరి కళ్యాణ్ రామ్ కు ఒక డిఫరెంట్ జోనర్. నందమూరి హీరోలలో ఈ జోనర్ ను టచ్ చేసిన మొదటి హీరో కళ్యాణ్ రామ్ అనే చెప్పాలి. మాస్ మసాలా యాక్షన్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్స్ లాంటి నందమూరి హీరోలు సాధారణంగా ఇలాంటి డిఫరెంట్ జోనర్ జోలికి వెళ్లరు. కానీ కొత్తగా ట్రై చేద్దాం అన్న ఆలోచనతో కాబోలు నందమూరి కళ్యాణ్ రామ్ ఔట్ ఆఫ్ ది బాక్స్ అన్నట్లు ఒక డిఫరెంట్ జోనర్ ను ఎంచుకున్నారు. ఇంతకూ ఏమిటా జోనర్ ? “సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్”.
కెమెరామన్ కె.వి.గుహన్ చెప్పిన కథలోని నావెల్టీ బాగా నచ్చటంతో ఈ సినిమా చేశానాని కళ్యాణ్ రామ్ చెప్తున్నారు. ఇంతకూ ఆ నావెల్టీ ఏమిటో రివ్యూలో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గౌతమ్( కళ్యాణ్ రామ్) ఒక టీవీ చానల్లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. అతను ఒకసారి ఒక పని మీద వెళ్లి ఒక గెస్ట్ హౌస్ లో రూమ్ నెంబర్ 118 లో బస చేస్తాడు. ఆ రోజు రాత్రి అతనికి ఒక కల వస్తుంది. ఆ కలలో కొందరు దుర్మార్గులు ఒక అమ్మాయిని దారుణంగా కొట్టి హింసిస్తుంటారు. కొండ పైనుండి ఒక కారును నీళ్లలోకి తోసేస్తుంటారు. ఉలిక్కి పడి లేచే సరికి వాల్ క్లాక్ లో టైం1.18 నిమిషాలు చూపిస్తుంది.
మరో సందర్భంలో అదే రూమ్ లో అదే కల అదే టైమ్ కు రిపీట్ అవుతుంది.
ఇలా తనకే ఆ కల రిపీట్ అవ్వటానికి కారణం ఏమిటి అని తీవ్రంగా ఆలోచిస్తూ కొలీగ్ (ప్రభాస్ శ్రీను) తో కలిసి ఒక సైకాలజిస్ట్( నాజర్) ను కలుస్తాడు. ఆ కలలో చూసిన సంఘటనలు నిత్యం తనను వెంటాడుతుంటాయి. వాటిని ఎక్కడో చూసినట్టు… ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది. ఇంతలో ఒకరోజు ఒక రాజకీయ నాయకుడి మనుషులు గౌతమ్ ని చంపడం కోసం వెంటాడుతుంటే వాళ్ళ నుండి తప్పించుకొని దూరంగా వెళ్తాడు. అక్కడ పరిసరాలను చూసి తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. ఆ లొకేషన్ చూస్తే తనకు కలలో వచ్చే కొండ, దాని కింద చెరువు as it is గా కనిపిస్తాయి. వెంటనే ఆ చెరువులోకి దూకి నీటి అడుగున వెతికితే ఒక కారు కనిపిస్తుంది. అది తన కలలోకి వచ్చే కారే. ఇలా తన కలలోకి వచ్చిన ప్రదేశాలు, వస్తువులు తనకు నిత్యం తారసపడటం వెనుక ఏదో మిస్టరీ ఉంది అనే కోణంలో పరిశోధన ప్రారంభిస్తాడు గౌతమ్. అతనికి సహకరిస్తుంది అతని వుడ్ బీ( షాలిని పాండే).
ఆ పరిశోధనలో తేలింది ఏమిటి? చిత్రహింసలకు గురి అవుతూ తనకు కలలో కనిపించే ఆ అమ్మాయి ఎవరు? తనతో పాటు రూమ్ నెంబర్118 లో బస చేసిన వాళ్లకు కూడా ఇలాంటి కలలు వస్తున్నాయా? తనకు కలలో వచ్చే అమ్మాయి పేరు ఆధ్య( నివేదిత థామస్) అని తెలుసుకున్న గౌతమ్ చివరకు ఆమె గురించి తెలుసుకున్న దిగ్భ్రాంతికరమైన నిజాలు ఏమిటి? ఇత్యాది సందేహాలకు సమాధానంగా నిలుస్తుంది ద్వితీయార్థం.
ఇది నిజంగా కళ్యాణ్ రామ్ కు ఒక డిఫరెంట్ జోనర్ అనే చెప్పాలి… ఇక ఈ కథను చిత్ర కథకుడు, స్క్రీన్ ప్లే రైటర్, దర్శకుడు, ఛాయాగ్రాహకుడు అయిన కె.వి.గుహన్ ఎలా డీల్ చేశాడు అని విశ్లేషించుకుంటే ఒక విభిన్న ప్రయత్నం కోసం కె.వి.గుహన్ పడిన తపన అభినందనీయంగా కనిపిస్తుంది. గతంలో సంచలన విజయాన్ని సాధించిన విక్రమ్ అపరిచితుడు లోని సైకలాజికల్ యాంగిల్ కొంత, సూర్య నటించిన బ్రదర్స్ చిత్రంలోని మెడికల్ మాఫియా యాంగిల్ కొంత కనిపించినప్పటికీ తెలుగులో 118 లాంటి ప్రయత్నాలు చాలా అరుదు. అయితే ఫస్టాఫ్ ను చాలా ఆసక్తికరంగా నడిపించిన గుహన్ సెకండ్ హాఫ్ లో కథా లోపం కారణంగా కొంత పార్ట్ వరకు బోర్ కొట్టించాడు. ఇన్వెస్టిగేషన్ process మొదట్లో కొత్త ఇంట్రెస్టింగ్గా అనిపించినప్పటికీ పోను పోను monotony కనిపించింది.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే – నటనకు అవకాశం ఉన్న పాత్రలు రెండే రెండు… కళ్యాణ్ రామ్ పోషించిన గౌతమ్, నివేథ థామస్ పోషించిన ఆధ్య పాత్రలకు మాత్రమే పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది. మిగిలిన అన్ని పాత్రలు ప్రజెన్స్ మేకింగ్ కే పరిమితమయ్యాయి.
ఇక టెక్నికల్ అండ్ మేకింగ్ స్టాండర్డ్స్ విషయంలో నూతన చిత్ర నిర్మాణ సంస్థ ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత, యువ నిర్మాత మహేష్ కోనేరును అభినందించాలి. నిర్మాతగా ఇది రెండవ సినిమా అయినప్పటికీ మంచి మేకింగ్ స్టాండర్డ్స్, ప్రొడక్షన్ వేల్యూస్ తో సినిమాను రిచ్ గా తీశారు. ఇలాంటి సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆరో ప్రాణం లాంటిది. ఒకే ఒక్క ఫ్యామిలీ సాంగ్ మాత్రమే ఉన్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర సమకూర్చిన రీ రికార్డింగ్ చాలా బాగుంది. మిగిలిన టెక్నికల్ అంశాలన్నీ up to the mark ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
*కళ్యాణ్ రామ్, నివేదితల పర్ఫార్మెన్స్
*శేఖర్ చంద్ర రీ రికార్డింగ్
* మేకింగ్ స్టాండర్డ్స్.
* స్క్రీన్ ప్లే
మైనస్ పాయింట్స్:
* రిపీటెడ్ జోనర్
* సెకండాఫ్ డ్రాపింగ్
118 తెలుగు మూవీ రివ్యూ
User Review
( votes)
[youtube_video videoid=olinfOgbNr4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: