బాహుబలి: ది ఎపిక్.. బజ్ పెంచిన సెంథిల్ ట్వీట్

Baahubali-The Epic Final Color Grading Wrapped Up - DOP Senthil Kumar

భారతీయ సినీ చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిన ‘బాహుబలి’ ప్రపంచాన్ని మరోసారి తెరపైకి తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ నుండి రాబోతున్న ప్రత్యేక ప్రాజెక్ట్ “బాహుబలి: ది ఎపిక్” గురించి తాజాగా కీలక అప్‌డేట్ విడుదలైంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన కె.కె. సెంథిల్ కుమార్ గారు సోషల్ మీడియా వేదికగా ఈ ప్రాజెక్ట్ ఫైనల్ కలర్ గ్రేడింగ్ పూర్తయినట్టు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బజ్ పెంచిన సెంథిల్ ట్వీట్

ఈ మేరకు సెంథిల్ కుమార్ తన అధికారిక ఎక్స్ లో బాహుబలి అభిమానుల అంచనాలను మరింత పెంచేలా మాట్లాడారు. “బాహుబలి ప్రపంచాన్ని మళ్లీ చూసే ప్రేక్షకులకు ఊపిరి సలపని విజువల్ అనుభూతిని అందించడానికి మేం శ్రమించాం. ‘బాహుబలి: ది ఎపిక్’ ఫైనల్ కలర్ గ్రేడింగ్‌ను అన్నపూర్ణ సౌండ్ అండ్ విజన్‌లో కలరిస్ట్ శివ, CTO సి.వి.రావు, రామ్‌తో కలిసి పూర్తి చేశాం.” అని అందులో పేర్కొన్నారు.

ఇక ఈ ట్వీట్ ప్రకారం, ‘బాహుబలి: ది ఎపిక్’ ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్‌గా ఉండబోతోందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా, బాహుబలికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన విజువల్స్ క్వాలిటీని మరింత ఉన్నత స్థాయిలో అందించేందుకు చిత్ర బృందం కృషి చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాహుబలి అభిమానులు ఈ సరికొత్త విజువల్ ఎపిక్‌ను తెరపై ఎప్పుడు చూస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.