‘గాడ్ ఆఫ్ ది మాసెస్’ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను డైనమిక్ అండ్ పవర్ ఫుల్ ఫోర్త్ కొలాబరేషన్ లో మోస్ట్ అవైటెడ్ హై-ఆక్టేన్ సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’ పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది.14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో థమన్ నూతన ప్రయోగం
ఇప్పటికే విడుదలైన అఖండ 2 టీజర్ భారీ బజ్ క్రియేట్ చేసి అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ నేపథ్యంలో సెన్సేషనల్ కంపోజర్ తమన్ తాజాగా అఖండ 2 బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రారంభించారు. అయితే, దీనికి వినూత్నంగా డివోషనల్ టచ్ యాడ్ చేస్తున్నారు. దీనిలో భాగంగా, శ్రవణ్ మిశ్రా, అతుల్ మిశ్రా అనే పండిత ద్వయాన్ని తన మ్యూజిక్ టీమ్‌లోకి తీసుకున్నారు.
ఈ పండిత సోదరులు సంస్కృత శ్లోకాలను అద్భుతంగా పఠించే నైపుణ్యంతో దేశవ్యాప్తంగా ఖ్యాతిగాంచారు. వేద శ్లోకాల పఠనంలో ప్రసిద్ధులైన ఈ ఇద్దరు సంగీత పండితులు, తమ వాయిస్ మరియు ఛాంటింగ్‌తో సినిమా బ్యాక్‌డ్రాప్‌కు ఒక కొత్త ఆధ్యాత్మిక వైభవాన్ని అందించనున్నారు. ఈ మ్యూజిక్‌తో ప్రేక్షకులు థియేటర్లలో పవిత్ర అనుభూతిని పొందుతారని టీమ్ విశ్వసిస్తోంది.
తమన్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో వీరు సంస్కృత శ్లోకాలతో మంత్ర ముగ్ధులను చేయబోతున్నారు. ఈ శ్లోకాలు, వేద మంత్రాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెచ్చేలా వుండబోతున్నాయి. తమన్ అందిస్తున్న పవర్ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హై వోల్టేజ్ ఎనర్జీ అందించబోతోంది.
ఈ చిత్రంలో సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ‘భజరంగీ భాయీజాన్’ ఫేమ్ హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. సి.రాంప్రసాద్, సంతోష్ D Detakae సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, తమ్మిరాజు ఎడిటర్. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
పవర్ ఫుల్ టీమ్, భారీ అంచనాలతో రాబోతున్న అఖండ 2: తాండవం గ్రేట్ స్పిరుచువల్, యాక్షన్ విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది. కాగా, అఖండ 2: తాండవం డిసెంబర్ 5, 2025న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























