జగపతి బాబు నిర్మాణంలో లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ

Jagapathi Babu to Produce Little Hearts Director’s Upcoming Movie

గత వారం చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకుపోతుంది లిటిల్ హార్ట్స్. #90s వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి హీరోగా నటించగా శివాని నాగరం మౌళికి జంటగా నటించింది. ప్రమోషన్స్ తో బాగానే జనాల్లోకి వెళ్ళింది.నిన్నటితో 24 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. మొదటి రోజే ఈసినిమా బ్రేక్ ఈవెన్ కావడంతో భారీ లాభాలను తీసుకొస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాపై స్టార్ హీరోలు ,డైరెక్టర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో డైరెక్టర్ సాయి మార్తాండ్ ఈసినిమాను తెరకెక్కించాడు. డైరెక్టర్ గా తనకు ఇదే మొదటి సినిమా.సింపుల్ లవ్ స్టోరీ తో సినిమాను బాగా డీల్ చేశాడనే పేరు కొట్టేసాడు ఈ డైరెక్టర్.ఇక సాయి మార్తాండ్ నెక్స్ట్ సినిమాను ప్రముఖ నటుడు జగపతి బాబు నిర్మాణంలో చేయనున్నాడు. జగపతి ఆర్ట్స్ బ్యానర్ లో జగపతి బాబు ఈసినిమా ను నిర్మించనున్నారు. త్వరలోనే ఈసినిమాకు సంబంధించిన వివరాలు వెలుబడనున్నాయి.

నిజానికి జగపతి బాబు లిటిల్ హార్ట్స్ లో ఓ రోల్ చేయాల్సివుంది.ఆయనను కలిసి సాయి మార్తాండ్ స్టోరీ కూడా వినిపించాడట.జగపతి బాబుకి కూడా బాగా నచ్చిందట కానీ డేట్స్ లేకపోవడం తో చేయడం కుదరలేదు.అయితే సాయి మార్తాండ్ నరేషన్ ఆకట్టుకోవడంతో ఈ దర్శకుడిలో విషయం ఉందని నెక్స్ట్ సినిమా నాతోనే చేయాలని జగపతి బాబు అడ్వాన్స్ చెక్ కూడా ఇచ్చేశారట.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.