మెగా హీరో వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో లావణ్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.ఈ శుభవార్త మెగా కుటుంబంలో, అభిమానుల్లో సంతోషాన్ని నింపింది.ఈ విషయం తెలియగానే మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ సినిమా సెట్స్ నుండి నేరుగా ఆసుపత్రికి వెళ్లి వరుణ్, లావణ్యలకు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగాచిరంజీవి ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి 2017లో మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు.ఆతరువాత పెద్దల అంగీకారంతో 2023 నవంబర్ 1న ఇటలీలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఏడాది మే నెలలో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ఈ జంట సోషల్ మీడియాలో ప్రకటించింది.ఇక ఇప్పుడు కొణిదెల కుటుంబంలోకి కొత్త సభ్యుడు రావడంతో మెగా ఫ్యాన్స్ అంతా ఆనందంలో మునిగిపోయారు.సోషల్ మీడియాలో వారికి శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది.
ఇదిలావుంటే వరుణ్ తేజ్ ప్రస్తుతం తన 15వ సినిమాలో నటిస్తున్నాడు.ఈసినిమాకు కొరియన్ కనకరాజ్ అనే టైటిల్ ప్రచారంలో వుంది.మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తుండగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.డిసెంబర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు వరుణ్ తేజ్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























